టాలీవుడ్ హీరోలు పిరికి స‌న్నాసులు.. ఎర్రి పువ్వులు... ఏకిప‌డేసిన అజ‌య్‌..!

RAMAKRISHNA S.S.
తాజాగా హీరోయిన్ స‌మంత‌తో పాటు అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లు ఎలా క‌ల‌క‌లం రేపుతున్నాయో చూస్తున్నాం.. అయితే దీనిపై ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. దీనిపై సోష‌ల్ మీడియాలో అజ‌య్ అమృత్ త‌న ఫేస్‌బుక్ వాల్‌లో పెట్టిన పోస్టు మ‌న టాలీవుడ్ హీరోల పిరికిత‌నాన్ని ప్ర‌శ్నించేలా ఉంది. ఇది కాస్త ఆలోచింప‌జేసేలా ఉంది కూడా.. దీనిని య‌దాత‌థంగా అందిస్తున్నాం.

కొండా సురేఖ వ్యాఖ్యలను గమనిస్తే తను సమంత క్యారక్టర్ ను గ్లోరిఫై చేసి మాట్లాడింది తప్ప తక్కువ చేసి మాట్లాడలేదు.. సమంత తప్పుడు పని చెయ్యడానికి ఒప్పుకోలేదు కాబట్టి విడాకులు తీసుకుంది అని చెప్పింది.. ఇందులో ఆడ మనిషి సమంత క్యారక్టర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు.. ఆవిడ కేవలం కేటీఆర్ ను టార్గెట్ చేసి అతనితో నాగార్జునకు ఉన్న సంబంధం కారణంగా నాగార్జునను కలిపి మాట్లాడింది.. ఏదేమైనా ఆవిధంగా మాట్లాడటం కొండా సురేఖ తప్పే కానీ ఆవిడ మాట్లాడటానికి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అంతో ఇంతో ఆధారాలుగా ఉన్నాయి..

కానీ నారా భువనేశ్వరి గారి విషయంలో ఎటువంటి ఆధారాలు లేకున్నా 70ఏళ్ల వయసున్న ఆవిడ క్యారెక్టర్ గురించి వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు అత్యంత జుగుప్సాకరంగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఈ సో కాల్డ్ సినీ మేధావులు హీరోలు ఎందుకు ఖండించలేదు?? భువనేశ్వరి గారి క్యారెక్టర్ ను టార్గెట్ చేస్తూ లోకేష్ గారి పుట్టుక గురించి నీచంగా మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించలేదు?? వీళ్ళ వెనకుండి ఆ తప్పుడు మాటలు మాట్లాడించడమే కాకుండా ఆ తర్వాత వారి మాటలను సమర్ధించిన జగన్ మోహన్ రెడ్డిని తప్పని ఎందుకు చెప్పలేదు?? అక్కినేని నాగార్జున, సమంత సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కాబట్టి స్పందిస్తున్నాం అంటారా ?? అని అజ‌య్ ప్ర‌శ్నించారు.

అలా అయితే వల్లభనేని వంశీ, కొడాలి నాని మూడేసి సినిమాలకు నిర్మాతలుగా చేసారు,, నారా భువనేశ్వరి గారు తెలుగు సినిమా లెజెండరీ నటుడు ఎన్టీఆర్ గారి కూతురు.. ఈవిధంగా అయినా సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి కదా, మరి వారి తప్పుడు మాటలను ఖండించాలి కదా.. ఎందుకు మూసుకుని ఉన్నారు?? ఆ విషయంలో తప్పుని తప్పుగా మాట్లాడితే బాబాయిని గొడ్డలితో నరికి చంపిన జగన్ రెడ్డి మిమ్మల్ని కూడా నరుకుతాడు అని భయపడ్డారా?? ఇంత పిరికి సన్నాసులు మీకు హీరోలు అని ట్యాగ్ లైన్ ఎందుకురా ఎర్రి పువ్వుల్లారా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: