ఆమె తో రామ్ చరణ్ రొమాన్స్.. టీనేజ్ సీక్రెట్స్ బయటపెట్టిన బన్నీ.. ఉపాసనకి తెలిస్తే.?

Pandrala Sravanthi
రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులు ఉన్నారు. అయితే అలాంటి రాంచరణ్ అల్లు అర్జున్ ల మధ్య కొద్దిపాటి గ్యాప్ పెరిగినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.అయితే ఇప్పటివరకు ఈ విషయాలపై ఎక్కడ స్పందించలేదు. మరి పుష్ప, గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ విషయం గురించి ఏమైనా బయట పడుతుందేమో చూడాలి. ఇక ఈ గొడవలన్నీ పక్కన పెడితే కుటుంబంగా వీరంతా ఒక్కటే. బయటి వాళ్లు ప్రచారం చేయడం తప్ప వారి మధ్య అంత కుళ్ళు కుతంత్రాలు ఏమీ ఉండవు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ రామ్ చరణ్ కాంబోలో మల్టీస్టారర్ మూవీ రావాలని ఎంతోమంది మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అయితే ఇప్పటికే ఎవడు సినిమా వచ్చినప్పటికీ ఈ మూవీలో అల్లు అర్జున్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుంది. కానీ ఇద్దరు పూర్తిస్థాయిలో కలిసి మల్టీ స్టారర్ తీయాలి అని అభిమానుల డిమాండ్. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా తీయాలి అని ఎప్పటినుండో అల్లు అరవింద్ కూడా అనుకుంటున్నారు.

 కానీ కుదరడం లేదు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ కి సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ అప్పుడప్పుడు బయటపెడుతూ ఉంటారు బన్నీ.అయితే వీరిద్దరూ కలిసి నటించిన ఎవడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో యాంకర్ ఎందుకు మీ ప్రతి సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని తీసుకుంటున్నారు. ఈ సినిమాలో కూడా కాజల్ ని తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో మీ పక్కన కాజల్ నటించకపోయినప్పటికీ ప్రతి మూవీలో తీసుకుంటున్నారు ఎందుకిలా అని అడగగా దానికి బన్నీ అన్సర్ ఇస్తూ.. చెర్రీ సినిమాలో కాజల్ ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఆమెతో ఎక్కువగా కలిసిపోవడం. వీరిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుండడంతో ఇద్దరి కాంబోలో సినిమాలు వస్తున్నాయి.

ఇక కొత్త హీరోయిన్ తో చేయాలంటే మాటలు కలవాలి అన్నీ కుదురుకోవాలి. కానీ పాత హీరోయిన్ అయితే అలవాటే కాబట్టి అన్నింట్లో తొందరగా సెట్ అవుతుంది అంటూ బన్నీ చెప్పారు. అలాగే ఎందుకు అమ్మాయిలందరూ సినిమాలో హీరోయిన్ల గురించి అడుగుతారు అని బన్నీ అడగగా.. దానికి యాంకర్ శ్యామల రియాక్ట్ అవుతూ.. మా అభిమాన హీరో ఎవరికో ముద్దులు పెట్టి ఎవరినో కౌగిలించుకుంటుంటే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనే ఆత్రుత మాకు ఉంటుంది కదా అని చెప్పింది.దానికి బన్నీ రొమాన్స్ లేదు ఏదీ లేదు అసలే మాకు పెళ్లిళ్లు అయిపోయాయి అంటూ మాట్లాడారు. అయితే ఈ ఇంటర్వ్యూలో కాజల్ చెర్రీల రొమాన్స్ గురించి బన్నీ స్పెషల్ గా మాట్లాడడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: