వ‌రుణ్‌తేజ్ ' మ‌ట్కా ' రిలీజ్‌డేట్ ఫిక్స్‌... నాలుగో ప్లాప్ త‌ప్పుతుందా..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
టాలీవుడ్ మెగా యంగ్ పేజీ హీరో వరుణ్ తేజ్ కొద్ది రోజుల క్రితం హీరో లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడి మూడుముళ్ల బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ జంట ఇప్పుడు టాలీవుడ్ లోని మోస్ట్ రొమాంటిక్ క‌ఫుల్ గా మీరు తెచ్చుకున్నారు . ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమా తర్వాత వ‌రుస పెట్టి డిజాస్టర్లు కొడుతున్నాడు. వ‌రుణ్‌ చివరిగా నటించిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. బలమైన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా వరుణ్ తేజ్ క‌థ‌ల పరంగా సరైన నిర్ణయాలు తీసుకోపోవడంతో వరుస‌ పెట్టి డిజాస్టర్లు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలోని వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న సినిమా మట్కా. మీనాక్షి చౌదరి - నోరా ఫతేహి హీరోయిన్లుగా దర్శకుడు కరుణ కుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ యాక్ష‌న్ డ్రామా పై మంచి అంచ‌నాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ ముందే మంచి అంచనాలతో ఉంది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్లో ప్లాట్ చేసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ తన మార్క్ వెర్సటాలిటీ  చూపిస్తూ వస్తున్నాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌ చేసేసారు. వరుణ్ తేజ్ పై ఒక వింటేజ్ లుక్ లో కనిపిస్తున్న పోస్టర్తో ఈ సినిమా రిలీజ్ డేట్ చేశారు.

నవంబర్ 14న మట్కా సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఈ పోస్టర్లో వరుణ్ తేజ్ మరోసారి మెగాస్టార్ వింటేజ్ లుక్స్ ని తలపిస్తున్నాడు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మూడుసార్లు వ‌రుస ప్లాపుల తర్వాత ఈ సినిమాతో అయినా వరుణ్ తేజ్ హిట్టు కొడతాడా ? లేక మరోసారి ప్రేక్షకులను నిరాశ పరుస్తాడా అన్నది నవంబర్ 14న తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: