జాన్వీ బోర్ కొట్టింది...ఇక కన్నడ బ్యూటీతో ఎన్టీఆర్ రొమాన్స్ ?

Veldandi Saikiran
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజీ ఏ హీరోకు లేదని చెప్పవచ్చు. అయితే దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత... సోలో హీరోగా ఇటీవల... థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. అది కూడా కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమాతో... జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక మొదట నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఇప్పుడు మంచి కలెక్షన్లతో దూసుకు వెళ్తోంది ఈ దేవర.
 

అయితే దేవరాజ్ సినిమా సక్సెస్ కలెక్షన్లను రాబడుతున్న నేపథ్యంలో... జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.  ఈ సినిమా  షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభమై 2026 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.

భారీ యాక్షన్..  సినిమాగా ప్రశాంత్ నీల్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రాబోతుంది.  వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దాని పైన సోషల్ మీడియాలో రోజుకో వార్త వస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా... చేస్తున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్ కన్ఫర్మ్ అయిందట. ఈ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీకి చెందిన... యంగ్ హీరోయిన్  అని సమాచారం.
 

కన్నడ నటి రుక్మిణి వసంత్.. ను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోకి తీసుకురానున్నారట ప్రశాంత్. దీనిపై.. నటి రుక్మిణి వసంతతో చర్చించారట. దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.  ఇది ఇలా ఉండగా సప్త సరాగాలు దాటి అనే సినిమాతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఇందులో ఆమె అందాలతో తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఇప్పుడు ఆ బ్యూటీ ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: