టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొన్ని సంవత్సరాల పాటు తిరుగులేని దర్శకుడిగా కెరియర్ను కొనసాగించిన కొరటాల శివ కెరియర్ గ్రాఫ్ ఈ మధ్య కాలంలో కాస్త పడిపోయింది . వరుసగా మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను మూవీ లతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఈ దర్శకుడు కొంత కాలం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే మూవీ ని రూపొందించాడు . ఈ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది .
ఈ సినిమాతో కొరటాల క్రేజ్ కాస్త తగ్గింది. ఇక ఈ మూవీ తర్వాత ఈయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 1 అనే మూవీ ని రూపొందించాడు.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు కూడా కాస్త నెగటివ్ టాక్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో కొరటాల సినిమాలన్నీ ఒకే పద్ధతిలో ఉంటాయి. అందుకే మొదటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు అంటున్నారు. అందులో భాగంగా లాజిక్ ను కూడా బయటకు తీస్తున్నారు. కొరటాల శివ సినిమాలో కచ్చితంగా తండ్రి , కొడుకు సెంటిమెంట్ ఉంటుంది. తండ్రి ఒక మంచి పని చేయాలి అనుకుంటాడు.
కానీ అతను ఆ మంచి పని చేయలేక పోతాడు. ఇక ఆ తర్వాత తన కొడుకు వచ్చి ఆ మంచి పని చేస్తాడు. కాస్త స్క్రీన్ ప్లే , స్టోరీ అటు ఇటు అవుతుంది కానీ కచ్చితంగా తండ్రి కొడుకుల సెంటిమెంట్ మాత్రం ఉండాల్సిందే. ఇలా కొరటాల రూపొందించిన ప్రతి సినిమాలోనూ ఉంది. అందుకే మొదటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పటి సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు అనే విశ్లేషణను కూడా కొంత.మంది బయటకు తీస్తున్నారు.