వరుస విజయాలతో అద్భుతమైన జోష్లో కెరియర్ను కొనసాగించిన కొరటాల శివ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీతో భారీ అపజయాన్ని ఎదుర్కొన్నాడు . ఈ మూవీ తో కొరటాల క్రేజ్ కూడా కాస్త తగ్గింది . ఆచార్య మూవీ సెట్స్ పై ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ తో తన నెక్స్ట్ మూవీ ని చేయనున్నట్లు ప్రకటించాడు. ఇక ఆచార్య భారీ డిజాస్టర్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాలతో చేయడు , వేరే స్టార్ డైరెక్టర్ ను వెతుక్కుంటాడు అని వార్తలు వచ్చాయి.
కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇచ్చిన మాట పై నిలబడి కొరటాలకు ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురైనా కూడా తనకు నెక్స్ట్ సినిమా అవకాశాన్ని ఇచ్చాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ , కొరటాలకు అంత పెద్ద డిజాస్టర్ వచ్చిన కూడా తన నెక్స్ట్ మూవీ అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడా అని చాలా మంది అనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న దర్శకులతో నెక్స్ట్ మూవీ లు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా చేసిన సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువ శాతం అపజయాలే వచ్చాయి.
ఇక టెంపర్ మూవీ దగ్గర నుండి ఆయన వరస ఫ్లాప్ లలో ఉన్న లేదా డీలా పడిపోయి ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇక కొరటాల శివ కూడా ఆచార్య మూవీ తో ఫ్లాప్ అందుకున్న కూడా అంతకు ముందు జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ కి బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఉండడం , ఆయన పని తనం కూడా అద్భుతంగా ఉంటుంది అనే నమ్మకంతోనే కొరటాలకు ఆయన సినిమా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.