గేమ్ చేంజర్ సంక్రాంతికి నో ఛాన్స్.. ఎందుకో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్గా నటించగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ మూవీ డిసెంబర్ 20 వ తేదీన విడుదల కావడం కష్టం అని అప్పటి వరకు ఈ సినిమా పనులు పూర్తి కావు అని దానితో ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక చిరంజీవి ప్రస్తుతం చికెన్ గున్యతో బాధపడుతూ ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ పెండింగ్లో పడిపోయింది అని సంక్రాంతి కి ఆ మూవీ విడుదల కాదు అని దానితో జనవరి 10 వ తేదీన గేమ్ చేంజర్ విడుదల కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే దిల్ రాజు ప్రస్తుతం వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ఒక వేళ గేమ్ చేంజర్ మూవీ ని సంక్రాంతి కి విడుదల చేసినట్లయితే వెంకటేష్ మూవీ ఆల్రెడీ సంక్రాంతి కి ఉంది. దానితో దిల్ రాజు బ్యానర్లో రూపొందిన రెండు సినిమాలు సంక్రాంతి కి వచ్చే అవకాశం ఉండదు. దానితో గేమ్ చేంజర్ మూవీ ని సంక్రాంతి కి విడుదల చేసే అవకాశం దాదాపుగా ఉండే ఛాన్స్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: