ఆ స్టేట్మెంట్ ఇచ్చి తప్పు చేసిన తారక్.. అక్కడ అదే మైనస్ అయ్యిందా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అతి చిన్న వయసులో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కూడా అదే స్థాయిలో కెరీర్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం తారక్ , రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తారక్ కి ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దానితో ఈయన తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు.

ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ హిందీ మీడియాతో మాట్లాడుతూ దేవర మొదటి భాగం అద్భుతంగా ఉండబోతుంది. మరి ముఖ్యంగా ఈ సినిమాలోని ఆఖరి 40 నిమిషాల సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ఆ ఆఖరి 40 నిమిషాల సినిమాతో మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని తారక్ చెప్పుకొచ్చాడు. దీనితో నిజంగానే ఆఖరి 40 నిమిషాలు ఎంతో అద్భుతంగా ఉంటుంది అని జనాలు అంచనా పెట్టుకున్నారు.

ఇక సినిమా మొత్తంలో ఆఖరి 40 నిమిషాలే అత్యంత డల్ గా ఉండడంతో తారక్ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి తప్పు చేశాడు. అనవసరంగా ఆఖరి 40 నిమిషాల పై హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ఆఖరి 40 నిమిషాల్లో గొప్ప సన్నివేశాలు ఏమీ లేకపోవడంతో అక్కడే ఈ సినిమా దెబ్బ కొట్టింది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: