పెద్ద ప్లాన్ వేసిన రజిని.. దెబ్బకు కోలీవుడ్ షాక్..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . రజనీ కాంత్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి కేవలం ఇండియా లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు . ఇకపోతే శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో మూవీ తర్వాత చాలా కాలం పాటు అపజయాలను ఎదుర్కొన్న రజనీకాంత్ పోయిన సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అప్పటివరకు ఏ తమిళ సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రజనీ కాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించక ముందు తమిళ నటుడు సూర్య హీరోగా రూపొందుతున్న కాంగువ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనుప్యంగా వెట్టాయన్ మూవీని అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటనను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు.  

దానితో సూర్య హీరోగా రూపొందుతున్న కంగువా సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఇది ఇలా ఉంటే సడన్గా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించిన కానీ ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు అద్భుతమైన స్థాయిలో ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై బజ్ పెరిగిపోయింది. ఈ సినిమాపై ప్రస్తుతానికి భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. అలా సడన్గా రిలీజ్ డేట్ ను ప్రకటించినా కూడా వెట్టాయన్ మూవీ తో రజిని కోలీవుడ్ ను షేక్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: