జీరో నుంచి హీరో...మాస్ మహారాజ్ ను టచ్‌ చేసే దమ్ము ఎవరికీ లేదుగా ?

Veldandi Saikiran

* సైడ్ హీరో క్యారెక్టర్ తో ఇండస్ట్రీలో రాణించిన రవితేజ  
* ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో హీరోగా గుర్తింపు
* మెగాస్టార్ తర్వాత ఇండస్ట్రీలో ఒంటరిగా ఎదిగిన రవితేజ
* ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోలలో రవితేజ ఒకరు
 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే మరికొంతమంది అట్టర్ ప్లాప్ అవుతున్నారు. కానీ కొంతమంది ఎవరి సపోర్ట్ లేకుండా చాలా కష్టపడి పైకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలా వచ్చిన వారిలో మాస్ మహారాజు రవితేజ ఒకరు. మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చిరంజీవులు, తిరుమల తిరుపతి వెంకటేశ, నిన్నే పెళ్ళాడుతా, అల్లరి ప్రియుడు లాంటి సినిమాలలో అతిధి పాత్రలో రవితేజ నటించి... రాణించగలిగారు. ఎక్కువ శాతం సైడ్ హీరో పాత్రల్లో నటించి కెరీర్ ప్రారంభించారు. 1991 నుంచి ఇప్పటివరకు రవితేజ కెరీర్ కొనసాగుతోంది. అయితే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం.... సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిపోయారు రవితేజ. ఆ తర్వాత ఇడియట్ సినిమాతో.. టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశారు.
 
పూరి జగన్నాథ్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ సినిమా సక్సెస్ కావడంతో... టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజకు మంచి క్రేజ్ వచ్చింది. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు,భద్ర, చంటి, వెంకీ లాంటి ఊర మా సినిమాలు చేసి అందర్నీ ఆకట్టుకున్నారు రవితేజ. ఇక ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి లాంటి దర్శకులతో కూడా సినిమాలు చేశారు రవితేజ.
 
రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు సినిమా చేసి అప్పట్లో హిస్టరీ క్రియేట్ చేశారు మాస్ మహారాజు రవితేజ. ఎక్కువ శాతం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రవితేజ యాక్టింగ్ ఉంటుంది. ఈ తరుణంలోనే మాస్ మహారాజగా ఆయన మారిపోయారు. ప్రస్తుతం యంగ్ హీరోలు వస్తున్న తరుణంలో కూడా...  క్రాక్ లాంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఎవరి సహాయం లేకుండానే ఇండస్ట్రీలో ఎదిగారు మాస్ మహారాజు రవితేజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: