ఆ ఒక్క కారణంతో మహేష్ మూవీని రిజెక్ట్ చేసిన తమన్నా.. చేసుంటే అలాంటి రిజల్ట్..?

MADDIBOINA AJAY KUMAR
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె హ్యాపీ డేస్ అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి ఇప్పటికీ కూడా అద్భుతమైన జోష్ లో కెరీర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తన కెరియర్లో చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది. ఈమె రిజెక్ట్ చేసిన సినిమాలలో కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించగా మరికొన్ని ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఓ సినిమాను రిజెక్ట్ చేసింది. ఆ మూవీ ఏది ..? అది ఎలాంటి రిజల్ట్ ను సాధించింది అనే వివరాలను తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే మూవీ తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్గా మొదట మేకర్స్ తమన్నా ను అనుకున్నారట. అందులో భాగంగా ఆ నటిని కూడా సంప్రదించారట.

కథ మొత్తం విన్న ఈమెకు కథ బాగా ఉంది కానీ ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల నేను ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో మేకర్స్ రకుల్ ప్రీత్ సింగ్ ను కలవడం , ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఇకపోతే బారి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. అలా తమన్నా , మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీ లో హీరోయిన్ అవకాశాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: