మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "చిరుత" అనే సినిమాతో సినీ కెరియర్ను మొదలు పెట్టాడు. హీరోగా కెరియర్ను మొదలు పెట్టిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తో రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఇక అప్పటి నుండి ఈయన అద్భుతమైన విజయాలను అందుకుంటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్గా నటించగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే అనేక మంది తెలుగు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్థాయి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కానీ అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఎందుకు అంటే రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీ గా రూపొందించారు. ఈ సినిమా కనుక పెద్ద స్థాయిలో సక్సెస్ అయినట్లు అయితే రామ్ చరణ్ కి ఇండియా వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ లభించే అవకాశం ఉంటుంది. మరి చరణ్ "గేమ్ చేంజర్" తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.