మేడమ్ టుస్సాడ్స్: రామ్ చరణ్ కే కాదు రైమ్ కి కూడా అరుదైన గౌరవం..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం లభించింది. అటు రామ్ చరణ్ కే కాదు ఆయన పెట్ రైమ్ కి కూడా ఈ గౌరవం లభించడం నిజంగా ఆ కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తుతోంది అని చెప్పవచ్చు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే లండన్ లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు రామ్ చరణ్ కు అరుదైన గౌరవాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సైమా 2024 అవార్డ్స్ లో వేదికగా ఈ విషయాన్ని ప్రకటించినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే.. లండన్ లోని అత్యంత ప్రతిష్టాత్మక మ్యూజియంగా పేరు సొంతం చేసుకున్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ కి వెళ్ళిన రామ్ చరణ్ అక్కడ తన విగ్రహ తయారీకి కావలసిన కొలతలను ఇచ్చినట్లు, అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
అలాగే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరొక విషయం ఏమిటంటే, రామ్ చరణ్ ఎప్పుడూ కూడా తన వెంట తన పెట్ డాగ్ ను తీసుకెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ డాగ్ కి కూడా అరుదైన గౌరవం లభించిందట. రామ్ చరణ్ ఫ్రెంచ్ బార్బేట్ జాతికి చెందిన కుక్కపిల్ల రైమ్ ను ఎప్పుడు తనతో తీసుకెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. అందుకే ఇప్పుడు కూడా రైమ్ ను ఎత్తుకొని ఉన్న రామ్ చరణ్ మైనపు బొమ్మని అక్కడ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అధికారిక వివరాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాంచరణ్ తో పాటు ఆయన కుక్కపిల్లకి కూడా ఈ గౌరవం లభించడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.