జాన్వీని తారక్ ముంచేశాడు...చరణ్‌ చేతిలో నలిగిపోవడమేనా ?

Veldandi Saikiran
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన చిత్రం దేవర. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఈనెల 27వ తేదీన పేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఈ సినిమా దేశ విదేశాల్లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుందన్న సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచి భారీగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ. 70.33 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ చెబుతున్నారు.
రెండవ రోజు కూడా వచ్చిన కలెక్షన్లను చిత్ర నిర్మాతలు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉండగా..... టాలీవుడ్ కు దేవర సినిమాతో పరిచయమైన జాన్వి కపూర్ పాత్రపై మాత్రం అభిమానులు కాస్త నిరాశను వ్యక్తం చేస్తున్నారు. తన నటన కూడా యావరేజ్ గానే ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. నిజానికి దేవర-1 లో తంగం పాత్ర తేలిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. జాన్వి కేవలం ఒక్క చుట్ట మల్లే పాటలో తప్పిస్తే మిగతా అంతా పది నిమిషాలు ఎటు పోయిందనే కామెంట్లు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమాలో జాన్వీది అతిధి పాత్ర అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.... ఈ సినిమా విడుదలకు ముందే జాన్వికపూర్ తెలుగులో మరికొన్ని సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ ఫ్యాన్స్ కి ఆమె కొత్త సినిమాపై ఫోకస్ పడింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ సినిమా తీయబోతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించనుంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ కి పెద్దగా పాత్ర లేదన్న సంగతి తెలిసిందే. పైగా ఉన్న కొన్ని సీన్లలో కూడా ఆమె తన నటనతో హైలెట్ కాలేకపోయింది. ఆమె గ్లామర్ కు తప్పితే నటనకు పెద్దగా స్కోప్ లేదు.
కాబట్టి జాన్వి కపూర్, చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై ప్రేక్షకులు ఆశలు పెట్టుకోకపోవడం మంచిదని అభిమానులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. జాన్వి కపూర్ తన టాలీవుడ్ డెబ్యూ కోసం ఎంతగానో ఎదురు చూసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాగైనా స్టార్ హీరోయిన్గా రాణించాలని అనుకున్న జాన్వి కపూర్ కి కాస్త నిరాశనే ఎదురైందని చెప్పాలి. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం కూడా జాన్వి కపూర్ కాస్త ఎదురుచూడాల్సిన పరిస్థితిలో ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమాలోనైనా జాన్వి కపూర్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుందేమో చూడాలని తన అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: