సమంత పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది!
ఇక తాజాగా సినీరంగంలో హీరోయిన్స్ ప్రతిష్టాత్మకంగా భావించే ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ని ఐఫా 2024 వేడుకలలో సామ్ అందుకుంది. దీంతో ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే గత 4 రోజులుగా స్టైలీష్ లుక్స్ లో వరుస ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది సామ్. గ్రీన్ స్టైలీష్ డ్రెస్సుకు తగినట్లుగా బంగారు చెవిపోగులను ధరించి, లుక్ కు తగినట్లుగా విలాసవంతమైన బల్గారీ సర్పెంటీ వాచ్ ధరించింది. ఈ నేపథ్యంలోనే వాచ్ ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నివేదికల ప్రకారం సమంత ధరించిన లగ్జరీ బల్గారీ వాచ్ ధర రూ.45.5 లక్షలు అని భోగట్టా.
ఇకపోతే సామ్ ఇటీవలే లండన్‌లోని సిటాడెల్ వరల్డ్ పార్టీకి హాజరు కావడం జరిగింది. అక్కడ మరోసారి అందరి లుక్ ఆమెపై పడింది. ఈసారి క్రేషా బజాజ్ రూపొందించిన అధునాతన నేవీ-బ్లూ డ్రెస్ లో కనిపించింది సమంత. ఇక కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సామ్.. ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. ఇక అనారోగ్యం కారణంగా ఆమె తన దైనందిత జీవితంలో యోగా, మెడిటేషన్ చేస్తూ తన ఫాలోవర్లకు సైతం ఆరోగ్య సూచనలు ఇస్తుంది.