టాలీవుడ్ మ‌హిళా డైరెక్ట‌ర్‌పై అత్యాచారం ... అంతా సీక్రెట్‌.. గ‌ప్‌చుప్‌..?

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ లో ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ పేరుతో రకరకాల ఆరోపణలు.. రకరకాల ప్రచారం జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా అవకాశాల కోసం అమ్మాయిలని ఎవరు ఎలా లోబరుచుకుంటారు అనే అంశంపై చాలా కథనాలు వినిపిస్తున్నాయి. హీరోలు మాత్రమే కాదు దర్శకులు .. నిర్మాతలు ... కెమెరామెన్లు చివరికి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు ఇద్దరు కాదు .. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్లుగా ఒక వెలుగు వెలగాలని ఇండస్ట్రీలో కి వచ్చే అమ్మాయిలను చాలామంది రకరకాలుగా వాడుకుంటారని వారు ఎంతోమంది కింద పక్కలో నలగాల్సి ఉంటుంది అన్నది తెలిసిందే.

ఇది టాలీవుడ్ లో ఇటీవల కాలంలో బాగా ఎక్కువైనట్టు కూడా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ మహిళ అసిస్టెంట్ డైరెక్టర్ పై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన బయటకు వచ్చింది. యూసఫ్ గూడ పరిధిలోని మధురానగర్ లో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నగరంలోని రహమత్ నగర్ కు చెందిన ఓ మహిళ ( 30 ) అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుంది. అయితే ఆమె ఈ ఏడాది జూన్లో తన భర్తతో విడాకులు తీసుకుంది. ఇటీవల ఆమెకు ఇంస్టాగ్రామ్ లో శశికిరణ్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

తనకు మూవీ కార్యాలయం ఉందని అందులో పని చేయాలని ఆ మహిళలకు మాయమాటలు చెప్పాడు. ఈనెల 27వ తేదీ రాత్రి మధురానగర్ లోని తన గదికి రావాలని శశికరణ్ రెడ్డి చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్ళింది. అనంతరం శశికరణ్ రెడ్డి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎలాగోలా ఆ గది నుంచి బయటపడింది. ఆ విషయం ఆమె రెండు అంతస్తులోని వారికి చెప్పడంతో వారు 100కు డయల్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చాలా గ‌ప్ చుప్ గా జ‌రుగుతోన్న ఇలాంటి వ్య‌వ‌హారాల్లో అమ్మాయిలు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: