రామ్‌చ‌ర‌ణ్‌ను టెన్ష‌న్ పెట్టేసిన ఎన్టీఆర్‌... చాలా రిస్క్‌లో పెట్టాడే...?

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇది అధికారికంగా ప్రకటించిన నెంబర్. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్ల టార్గెట్ 172 కోట్లు. ఇక రాంచరణ్ సినిమా గేమ్ ఛేంజర్. కోలీవుడ్ సీనియర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే దేవర సినిమాకు తొలి రోజు రు. 172 కోట్ల గ్రాస్ రావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ ను టెన్షన్ లో పెట్టినట్టు అయింది. గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా టార్గెట్ ఏంటి ? త్రిబుల్ ఆర్ ను క్రాస్ చేయాలా ?సలార్ ను అధిగమించాలా లేదా కల్కి రికార్డులను సమం చేయాలా .. ఇవన్నీ పక్కన పెట్టాలి ముందు దేవర సినిమా తొలిరోజు వసూళ్లను క్రాస్ చేయాలి.

త్రిబుల్ ఆర్‌ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా దేవర. అలాగే త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా గేమ్ చేంజర్ కాబట్టి చరణ్ టార్గెట్ కచ్చితంగా దేవర రికార్డులు మాత్రమే అని చెప్పాలి. గేమ్ ఛేంజ‌ర్‌ డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తోంది. భారతీయుడు 2 సినిమా రిలీజ్ అవ్వటానికి ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తర్వాత హైప్‌ తగ్గింది. దీనికి తోడు ప్రచారాన్ని కూడా పాక్షికంగా ఆపడంతో బజ్‌ తగ్గింది. ఇప్పుడిప్పుడే గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాకు మళ్ళీ ప్రచారం మొదలుపెట్టారు. మొదటి సింగిల్ పెద్దగా ఆకట్టుకోలేదు. రెండో పాట హిట్ అయితే సినిమాకు హైప్ వస్తుంది. ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే గేమ్ ఛేంజ‌ర్‌ కూడా దేవర స్ట్రాటజీ ఫాలో అవ్వక తప్పని పరిస్థితి. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా చేయరా అద్వాని హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: