పాన్ ఇండియా మూవీ.. గుదిబండలా మారిన హీరోలు..

Divya
•పాన్ ఇండియా మోజులో పెరుగుతున్న బడ్జెట్..
•హీరోల పారితోషకం నిర్మాతలకు గుదిబండగా మారిందా
•ఇలాగే కొనసాగితే ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి..?
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ఏ ఒక్కరైనా సరే ముందుగా ప్రాంతీయ భాషల్లో సక్సెస్ అయితే, ఆ తర్వాత ఇతర భాషల్లో ఆటోమేటిక్ గా గుర్తింపు వస్తుంది అని ఆలోచిస్తున్నారు.  అయితే ఈ మధ్యకాలంలో పరిస్థితి మారిపోయింది . చిన్న హీరోలను మొదలుకొని స్టార్ హీరోల వరకు అందరూ పాన్ ఇండియా చిత్రాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి బడ్జెట్ పెట్టి సినిమా తీసి అన్ని భాషలలో విడుదల చేశామంటే కష్టపడకుండానే అన్ని భాషలలో పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే రేంజ్ లో పాన్ ఇండియా చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.
అయితే ఈ పాన్ ఇండియా చిత్రాల కారణంగా హీరోలు నిర్మాతలకు గుదిబండలుగా మారిపోతున్నారని చెప్పవచ్చు. పాన్ ఇండియా పేరిట ఏకంగా కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. సాధారణంగా పాన్ ఇండియా చిత్రం అంటే మినిమం రూ.100 కోట్లు అయినా బడ్జెట్ పెట్టాల్సిందే.  అయితే ఇందులో సినిమా సినిమా క్వాలిటీకి అయ్యే ఖర్చు కంటే హీరో పారితోషకమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఉదాహరణకు పెద్ద పెద్ద హీరోలంతా కూడా రూ.100 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటూ సినిమా బడ్జెట్ ను  పెంచేస్తున్నారు. వరుసగా హీరోలు పారితోషకం పెంచేస్తున్న నేపద్యంలో నిర్మాతలకు తడిసి మోపిడౌతోంది. అంతేకాదు పెరిగిన హీరోల రెమ్యూనరేషన్ ఇండస్ట్రీని ఇబ్బందుల్లోకి నెట్టేసే పరిస్థితి ఏర్పడిందని సమాచారం.
ముఖ్యంగా హీరోల తాలూకు ఇమేజ్ పేరుతో వందల కోట్లకు తోడు.. డైరెక్టర్ల తాలూకు అర్థంలేని తనం సినిమాను మరింత భారంగా మారుస్తుందని చెప్పవచ్చు.  భారీ బడ్జెట్ అంటూ సినిమాలో భారంగా మార్చేసి ఇండస్ట్రీని దెబ్బతీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అభిమానుల సైతం వాపోతున్నారు.  హిట్ సినిమాకి స్టార్లు గ్యారెంటీ కాదు అంటూ ఇటీవల కొంతమంది హీరోలు చెప్పేసి చేతులు దులుపుకుంటున్న విషయం తెలిసిందే. మరి పాన్ ఇండియా పోటీలో పడి కథను కూడా పక్కన పెడుతున్నారు. పారితోషకాలు పెంచేసి ఆ భారాన్ని టికెట్ రూపంలో జనాల మీదకు తోసేస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రభావం అంతా ఇండస్ట్రీ పైన పడుతోంది.  మరి ఇప్పటికైనా హీరోలు తమ నిర్ణయాలను మార్చుకొని కథ కంటెంట్ ఉన్న చిత్రాలతో ప్రేక్షకులకు ముందుకు రావాలని,  ఇండస్ట్రీని ఆదుకోవాలని కూడా సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: