కథలో కంటెంట్ లేకపోయినా రెండు భాగాలు అందుకేనా.. ?

Pulgam Srinivas
కొంత కాలం క్రితం మన తెలుగు సినిమాలు చాలా వరకు ఒకే భాషలో విడుదల అవుతూ ఉంటాయి. ఏదైనా ఒకటి , రెండు సినిమాలు విడుదల అయిన కానీ తెలుగు తో పాటు మరో ఒకటి లేదా రెండు భాషల్లో విడుదల అయ్యేవి. దానితో మన సినిమాలకు కలెక్షన్లు కూడా పెద్దగా వచ్చేవి కావు. కానీ రాజమౌళి ఎప్పుడైతే బాహుబలి సినిమాను తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేసి అద్భుతమైన విజయాలను అందుకున్నాడో ఆ తర్వాత నుండి అందరి దృష్టి పాన్ ఇండియా మూవీలపై పడిపోయింది. ఇక పాన్ ఇండియా మూవీలను తీయడం అంటే అంత చిన్న విషయం కాదు.

దానికి యూనివర్సల్ సబ్జెక్టు ఉండాలి. అలాగే ఐదు భాషల ప్రేక్షకులను మెప్పించే అంత సత్తా ఆ కథలో ఉండాలి. అలాగే పాన్ ఇండియా సినిమాలను తీయాలి అంటే కాస్త బడ్జెట్ కూడా ఎక్కువ గానే అవుతుంది. ఇక కొంతమంది దర్శకులు పాన్ ఇండియా సినిమా అంటూ మూవీ ని మొదలు పెట్టేస్తున్నారు. కానీ బడ్జెట్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఆ బడ్జెట్ ను ఎలాగైనా రప్పించాలి అనే ఉద్దేశంతో ఉన్న కథనే అటు ఇటు లాగి ఆ మూవీ కి  అనౌన్స్ చేస్తున్నారు. 

ఒక వేళ మొదటి భాగం కనుక మంచి విజయం సాధిస్తే దానికి కొనసాగింపుగా రెండవ భాగాన్ని రూపొందించినట్లు అయితే మొదటి భాగం విజయం సాధించింది కాబట్టి రెండవ భాగం పై ప్రేక్షకుల్లో ఆటోమేటిక్ గా అంచనాలు ఏర్పడతాయి. దానిని ఉపయోగించుకోవచ్చు అని కథలో కంటెంట్ లేకపోయిన మొదటి భాగాన్ని కాస్త సాగదీసి ఓ పాట , ఓ యాక్షన్ సన్నివేశం తగిలించి రెండవ భాగంకు స్కోప్ వెతుకుతున్నారు. అలా చేయడం వల్ల మొదటి భాగంలో కథ బలం చాలా వరకు తగ్గిపోవడంతో మొదటి భాగం తోనే సినిమా ప్రేక్షకులకు నచ్చని సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

దానితో అనౌన్స్ చేసిన రెండవ భాగం సినిమాలు రానివి కూడా అనేకం ఉన్నాయి. అలా పాన్ ఇండియా సినిమాలు అని మొదలు పెట్టి బడ్జెట్ పెరిగిపోవడంతో రెండో భాగం అని అనౌన్స్ చేసి మొదటి భాగం లోనే కథ తేలిపోవడంతో రెండవ భాగాన్ని ఆపేయడం లాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: