బాలీవుడ్‌లోనూ ‘దేవర’ కు ఎదురీతనే..గట్టెక్కేడం కష్టమేనా ?
ఎన్టీఆర్ ను ఎలా చూడాలి అనుకున్నామో అలానే ఈ సినిమాలో ఉన్నారు అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో కొందరు ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ సినిమా టాక్ తో కొరటాల శివ సేఫ్ అయ్యాడనే చెప్పాలి. దేవర సినిమా మొదటి రోజు పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. అయితే దేవర సినిమాలో బాలీవుడ్ నటీనటులు ఉన్నారు కాబట్టి హిందీ ఆడియన్స్ ఈ సినిమాకు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి రాజమౌళికి మినహా బాలీవుడ్ లో ఏ స్టార్ డైరెక్టర్ కి బ్రాండ్ ఇమేజ్ లేదు. కాంతార, కేజీఎఫ్ వంటి సినిమాలు సైతం మెల్లిమెల్లిగా హిట్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ఫాలోయింగ్ ఏర్పడడంతో 'కల్కి 2898AD' సినిమా వరకు ప్రభాస్ ని హిందీ ఆడియన్స్ అభిమానిస్తూ వస్తున్నారు. కానీ ప్రతి హీరోకి ఆ కల్ట్ స్టేటస్ సంపాదించడం సాధ్యం కాదు.
ఇక దేవర సినిమా విషయానికి వస్తే.... జూనియర్ ఎన్టీఆర్ తన భాషాభినయంతో కొంతవరకు హిందీ ప్రేక్షకులకు దగ్గర అయినప్పటికీ కల్ట్ బేస్ మాత్రం లేదు. కొద్దిగా పాజిటివ్ టాక్ వస్తే చాలు హిందీ ఆడియన్స్ సినిమాలని చూసేందుకు అస్సలు వెనకాడరు. ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ల స్టార్ డమ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి తోడ్పడే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.