దేవర దెబ్బ...ఇక పై తర్వాతి సినిమాలకు NTR ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే...?
* ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరతో ఎన్టీఆర్ కు నెగిటివ్
* కథ స్లోగా వెళ్లడంతో దేవరపై విమర్శలు
* ఇలాంటి సినిమాలు మాకు వద్దు అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
జూనియర్ ఎన్టీఆర్ కు ఏ హీరోకు లేని ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ బేస్ ఉంది. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఆరు సంవత్సరాల తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందుకు రావడంతో అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. సినిమా గట్టిగానే కొడతాడని అందరూ భావించారు.
కానీ రియాల్టీ విషయానికి వస్తే... సినిమా పెద్దగా లేదని సమాచారం. 100 లో 70% నెగటివ్ టాక్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే విషయాన్ని ఫాన్స్ చెప్పడం జరుగుతుంది. సినిమా విశ్లేషకులు కూడా... గత బాగా స్లోగా ఉండటం, రొటీన్ గా సన్నివేశాలు ఉండటంతో.. వాళ్లు కూడా పెదవి విరుస్తున్నారు. దీనంతటికి కారణం కొరటాల శివ దర్శకత్వమని కూడా కొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనా ఇకపైన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో చేసేటప్పుడు..జూనియర్ ఎన్టీఆర్... కొన్ని సలహాలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు.
దేవర సినిమాలో చేసిన తప్పిదాలు మళ్లీ చేయకూడదని ఫ్యాన్స్ కోరుతున్నారు. డిజాస్టర్ దర్శకుడితో... జూనియర్ ఎన్టీఆర్... ఇకపై సినిమాలు చేయకూడదని సలహాలు ఇస్తున్నారు ఫ్యాన్స్. ఆచార్య లాంటి డిజాస్టర్ ఎదుర్కొన్న కొరటాల శివకు అవకాశం ఇచ్చి తప్పిదం చేశారని చెబుతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్... డ్యూయల్ పాత్రలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అసూచిస్తున్నారు.రొటీన్ కథలను ఎన్టీఆర్ రిజెక్ట్ చేయాలని అంటున్నారు.
పార్ట్ 1 అలాగే పార్ట్-2 ఇలా తీసి టైం వేస్ట్ చేసుకోకూడదని జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ సూచిస్తున్నారు. అంతేకాకుండా... డల్ గా ఉండే కథలను అస్సలు ఎంచుకోకూడదని చెబుతున్నారు. ఏడాదిలో రెండు సినిమాలు అయినా రిలీజ్ అయ్యేలా జూనియర్ ఎన్టీఆర్.. అడుగులు వేయాలని అంటున్నారు. సినిమా మ్యూజిక్, ఇటు హీరోయిన్ పాత్రలపై కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా దర్శకుడు చెప్పే కథ.. ఫ్యాన్స్ గల్ల ఎగరేసేలా ఉందా? లేదా...? అనేది చూసుకోవాలని చెబుతున్నారు. ఓ టెంపర్ లాంటి సినిమా చేయాలని కూడా కోరుతున్నారు.