జక్కన్న వల్లే.. "దేవర" కొంప మునిగిందా ?
* రాజమౌళితో సినిమా చేసిన హీరోకు అన్ని డిజాస్టర్లే
* ప్రభాస్, రామ్ చరణ్, నాని, రవితేజకు ఇదే పరిస్థితి
* ఆర్.ఆర్.ఆర్ తర్వాత దేవరకు కూడా నెగిటివ్ టాక్
అయితే దేవర సినిమా పూర్తిగా డిజాస్టర్ అని చెప్పలేము కానీ... కలెక్షన్లను మాత్రం రాబట్టే ఛాన్స్ ఉంది. కాస్త క్లిక్ అయితే సినిమా బంపర్ హిట్ అయ్యేది. కొరటాల శివ దర్శకత్వమే.. దెబ్బతీసిందని అంటున్నారు. దానికి తోడు రాజమౌళి సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదని... అందుకే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటూ ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జక్కన్నతో సినిమా చేసిన తర్వాత కచ్చితంగా హీరోలు ఫ్లాప్ వైపే అడుగులు వేస్తున్నారు.
ఎంత మంచి కథ అలాగే దర్శకుడు తగిలినా కూడా... జక్కన్న తర్వాత ఏ సినిమా చేసిన... హీరో హిట్ కావడం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరియర్ చాలా దారుణంగా తయారయింది. ఈగ తర్వాత నాని డిజాస్టర్ ను ఫేస్ చేశారు. విక్రమార్కుడు తర్వాత కూడా రవితేజకు అదే పరిస్థితి. గతంలో స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి సినిమా చేసిన తర్వాత కూడా ఎన్టీఆర్ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. మగధీర సినిమా చేసిన తర్వాత రామ్ చరణ్ కు అదే పరిస్థితి వచ్చింది.
ఇలా చెప్పుకుంటూ పోతే జక్కన్న దర్శకత్వంలో సినిమాలు చేస్తే కచ్చితంగా.. నెక్స్ట్ సినిమాను.. హీరోలు కోల్పోతున్నారు. ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు. దేవర కంటే ముందు ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు ఎన్టీఆర్. ఇప్పుడు దేవర.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు జూనియర్ ఎన్టీఆర్ వస్తే... తడబడి పోయారు. దీంతో దేవర నెగిటివ్ టాక్ తెచ్చుకోవడానికి రాజమౌళి కారణమని చెబుతున్నారు.