కొరటాల పెద్ద చీటర్.. చిరునే కాదు.. ఎన్టీఆర్‌ను ముంచేశాడు..?
"దేవర" సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలో హీరోగా తన అదృష్టాన్ని ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ పరీక్షించుకుంటున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన ఎన్టీఆర్ ఇప్పుడు ఆ స్టార్డను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేడు విడుదలైన దేవర సినిమా తారక్‌కు మరో పాన్ ఇండియా హిట్ ఇస్తుందా? అంటే మిక్స్డ్ ఆన్సర్లు వినిపిస్తున్నాయి. కొరటాల శివ ఆచార్య సినిమాతో చిరంజీవిని దారుణంగా ముంచేశాడు. ఈ సినిమా చిరు కెరీర్ లో ఓ పెద్ద అవమానకర ఫ్లాప్ గా మారింది. దీనివల్ల ఆయన అన్ని విధాలా నష్టపోయారు.
1980s బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర సముద్రం చుట్టూ ఉన్న నాలుగు గ్రామాల తీర ప్రాంతంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. దేవర కొంతమంది సముద్ర దొంగలకు నాయకత్వం వహిస్తాడు తర్వాత దొంగతనం మానేయాలని చెప్తాడు అప్పటినుంచి అతనికి ఆ దొంగలు అందరూ వ్యతిరేకమవుతారు వారిలో భయం నెలకొల్పడానికి వారిని చంపేస్తుంటాడు దేవర. తర్వాత అతని కుమారుడు వరద ఈ దొంగలను క్రమశిక్షణలో పెడతాడా లేదా అనేది మిగతా స్టోరీ. విజువల్స్ పరంగా తెలుగు సినిమా స్టాండర్డ్స్ కంటే దేవర మూవీ ఒక నాలుగు ఐదు రేట్లు మంచిగానే ఉంటుంది. తీర ప్రాంతం గ్రామాల సెట్టింగ్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి.
దేవర క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అందులో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. అయితే ఫస్ట్ ఆఫ్ బాగానే నడిపించగలిగాడు కానీ తర్వాత కొరటాల శివ చేతులెత్తేశాడు. పెద్దపెద్ద ఫైట్ సీక్వెన్స్ లతో కథను నాశనం చేశాడు. సినిమా రిమైనింగ్ స్టోరీని సీక్వెల్ లో రివీల్ చేయాలనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ ను సాగదీసినట్లుగా కూడా అనిపించింది. బాహుబలి లో లాగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కొరటాల శివ ఫస్ట్ పార్ట్ ని చెత్తగా తీశాడు.
సెకండాఫ్ కి వచ్చేసరికి సినిమాలోని యాక్షన్స్ అన్ని సన్నివేశాలు కూడా తేలిపోయాయి. క్లైమాక్స్ కూడా డిసప్పాయింట్ చేసింది. మొత్తం మీద ఆచార్య సినిమా లాగానే ఈ మూవీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. చిరంజీవిని మోసం చేసినట్లే ఎన్టీఆర్ ని కూడా చెత్త సినిమాతో చీట్ చేశాడు కొరటాల శివ. ఇంత పెద్ద బడ్జెట్, అంత పెద్ద తారాగణాన్ని పెట్టుకొని అతను మంచిగా సినిమా తీయకుండా అందరినీ నిరాశపరిచాడు. పార్ట్ 1 లోనే చక్కగా స్టోరీ చెప్పి ఉంటే అది పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యుండేది. ఈ సినిమానే ఇలా ఉంటే ఇక పార్ట్ 2 ఎవరు చూస్తారు అనేది ప్రశ్నార్ధకమే.