జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన విధానం టెంపర్ మూవీ నుండి చాలా వరకు మారిపోయింది. టెంపర్ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ ఎక్కువగా శాతం ఆ ముందు సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న దర్శకలతో సినిమాలు చేసేవాడు. కానీ అంత వాటితో చాలా వరకు అపజయాలను అందుకున్నాడు. ఇక టెంపర్ మూవీ కంటే ముందు పూరి జగన్నాథ్ వరస పరాజయాలతో డీలా పడిపోయి ఉన్నాడు. కానీ ఆయనతో సినిమా చేసి తారక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక అప్పటి నుండి ఈయన కథల ఎంపిక విషయంలో కూడా అద్భుతమైన స్థాయిలో ముందుకు సాగుతున్నాడు.
దానితో టెంపర్ మూవీ నుండి కొంత కాలం క్రితం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు ఎన్టీఆర్ నటించిన ప్రతి మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈయన ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ దశలో ఉన్న సమయంలోనే కొరటాలతో తన నెక్స్ట్ మూవీ ని అనౌన్స్ చేశాడు. కానీ కొరటాల "ఆచార్య" మూవీ తో భారీ అపజయాన్ని అందుకున్నాడు. దానితో చాలా మంది తారక్ ప్రస్తుతం అద్భుతమైన విజయాలతో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. కొరటాల "ఆచార్య" మూవీ తో భారీ అపజయాన్ని అందుకున్నాడు. దానితో కొరటాల ను పక్కన పెట్టి వేరే దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేస్తే బాగుంటుంది , అది ఆయన కెరీర్ కు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని అన్నవారు అనేక మంది ఉన్నారు.
కానీ ఎన్టీఆర్ మాత్రం ఇచ్చిన మాట పై నిలబడి కొరటాల తోనే సినిమా చేయడానికి ముందుకు వెళ్లాడు. ఇక ఎన్టీఆర్ , కొరటాల కాంబోలో రూపొందిన దేవర మొదటి భాగం సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభిస్తుంది. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి టాక్ తో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.