మహేష్ లుక్ పై కన్ఫ్యూజన్ !

Seetha Sailaja
రాజమౌళితో సినిమా చేసే టాప్ హీరోలకు ఎటువంటి మొహమాటం లేకుండా జక్కన్న కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటాడు అని అంటూ ఉంటారు. గతంలో ‘బాహుబలి’ నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రభాస్ అదేవిధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాణంలో ఉన్నప్పుడు చరణ్ జూనియర్ లు బయట ఫంక్షన్స్ లో పెద్దగా కనిపించేవారు కాదు. అయితే దీనికి భిన్నంగా మహేష్ రాజమౌళి మూవీకి సంబంధించి పొడవైన జుత్తు ఒత్తైన మీసం గుబురు గడ్డం పెంచుకుని కూడ తరుచూ మహేష్ ఏదో ఒక ఫంక్షన్ లో కనిపిస్తూ ఉండటంతో రాజమౌళి మహేష్ పై ఆంక్షలు పెట్టలేదా అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు.

ఈమధ్య మహేష్ తన భార్య నమ్రత తో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళం అందిస్తున్న ఫోటో మీడియాలో కనిపించింది. ఈ ఫోటోలో కూడ మహేష్ తన జుట్టును మరింత పెంచి కనిపించాడు. దీనితో జక్కన్న మహేష్ కు ఎలాంటి కండిషన్స్ పెట్టి ఉండకపోవచ్చు అన్న మాటలు మరింత వినిపించాయి. అయితే ఈ విషయమై ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తలు మరోవిధంగా ఉన్నాయి.

ప్రస్తుతం మహేష్ పెంచుకున్న జుట్టు గెడ్డం మీశాలతో జక్కన్న సినిమాలో కనిపించడట. అమెరికా నుండి అదేవిధంగా లండన్ నుండి ఐదుగురు హెయిర్ స్టైలిస్ట్ లను పిలిపించి వారితో మహేష్ హెయిర్ లుక్ కు సంబంధించి రకరకాల డ్రాయింగ్స్ అదేవిధంగా ఫోటో ఘాట్ లు చేయించిన తరువాత మాత్రమే మహేష్ ఈసినిమాలో కనిపించబోయే హెయిర్ స్టైల్ ఫైనల్ చేస్తాడని అంటున్నారు.

ఒకసారి అతడి హెయిర్ స్టైల్ లుక్ ఫైనల్ అయిన తరువాత మహేష్ మూమెంట్స్ పై జక్కన్న ఆంక్షలు పెడతాడని ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో మహేష్ బయట ఫంక్షన్స్ కు వెళ్ళవలసి వ్యక్తే తన హెయిర్ స్టైల్ ను పూర్తిగా కవర్ చేస్తూ హ్యాట్ పెట్టుకుని కళ్ళకు కళ్ళజోడు పెట్టుకుని వీలైనంత వరకు తన మొఖం కవర్ చేసుకుని బయటకు వెళ్ళమని సలహా ఇచ్చాడట జక్కన్న..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: