దేవరలో మహేష్- బాలయ్య.. ఇది మెంటల్ ఎక్కించే న్యూస్..!

RAMAKRISHNA S.S.
మ్యాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో వస్తున్న దేవర మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్కు ముందే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ పై కొత్త చరిత్రను తిరగరాయునుంది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.
దేవరలో ఓ స్టార్ హీరో గెస్ట్ ఆపీరియన్స్ లో కనిపించబోతున్నాడని ప్రచారం గట్టిగా వినిపిస్తుంది. ఆ స్టార్ హీరో మహేష్ బాబు లేదా బాలయ్య అయ్యుంటాడని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మహేష్ కి అటు ఎన్టీఆర్ ఇటు కొరటాల ఇద్దరితోను మంచి రిలేషన్ ఉంది. వీరిద్దరి మధ్య బ్రదర్ లాంటి బాండింగ్ కూడా ఉంది. ఇక కొరటాల దర్శకత్వంలో మహేష్ శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు కూడా చేశాడు. అయితే ఇదే క్రమంలో బాలకృష్ణ- ఎన్టీఆర్ బంధంపై కూడా గత కొన్ని రోజులగా ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి చెక్ పెట్టేందుకు ఇద్దరూ రెడీ అయ్యారు. మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ సమయంలో కూడా ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే క్ర‌మంలో బాలకృష్ణ దేవరలో గెస్ట్ రోల్ లో నటించాడని కూడా అంటున్నారు.
అయితే దీనిపై మరో వార్త కూడా చక్కర్లు కొడుతుంది. దేవరలో మహేష్ లేదా బాల‌య్య‌ది గెస్ట్ రోల్‌ కాదని కేవలం వాయిస్ ఓవర్  అందించారని కూడా అంటున్నారు. ఇక మరి ఇందులో ఏది నిజమైన మాత్రం అటు ఎన్టీఆర్ అభిమానులకు పండగే. ఇదే క్రమంలో బాలయ్య వాయిస్ ఓవర్ తో దేవర వస్తే మాత్రం అటు నందమూరి అభిమానుల్లో గాని ఇటు తెలుగు అభిమన్యులకు గాని ఎన్టీఆర్- బాలయ్య పై వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోతుంది. ఇక మరి ఈ న్యూస్ కేవలం ప్రచారానికే  పరిమితమవుతుందా?  అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: