ఆ సెంటిమెంటుతో దేవర భయాన్ని పోగొడతాడా?.. లేక మరింత పెంచుతాట..!?

RAMAKRISHNA S.S.
మరి కొద్ది గంటల్లో దేవర తుఫాన్ థియేటర్లోకి రాబోతుంది. ఈ క్రమంలో దేవర ఏం ఏం చేస్తాడు? అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే రాజమౌళి అభిమానులు కూడా ఈ మూవీ రిజల్ట్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తోనే మొదలైంది ఎన్టీఆర్ తోనే ఎండికార్డు పడుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే రాజమౌళితో ఓ హీరో సినిమా చేసినన తర్వాత.. నెక్స్ట్ సినిమా ప్లాప్ అవుతుంది అది ఎన్టీఆర్ తోనే మొదలవుగా రాజమౌళి హీరోలకు అది ఆనవాయితీగా మారింది.
జక్కన్న ప్రయాణం ఎన్టీఆర్ తోనే ప్రారంభమైంది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా హిట్ అవ్వగా ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన సుబ్బు సినిమా ఫ్లాఫ్ అయింది. సింహాద్రి తర్వాత వచ్చిన ఆంధ్రావాలా డిజాస్టర్ అయింది. యమదొంగ తర్వాత వచ్చిన కంత్రి కూడా ప్లాప్‌గా మిగిలింది. ఇలా ఒక్క ఎన్టీఆర్ అనే కాదు ప్రభాస్ సహా చాలా మంది హీరోల పరిస్థితి కూడాా ఇదే. చూడాలి దీంతో ఇప్పుడు దేవర ఏం చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా ఇదే. కొరటాల శివ తెర్కక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే కొరటాల చివరి సినిమా ఆచార్య  డిజాస్టర్  అయింది దీనికి తోడు రాజమౌళి సెంటిమెంట్ కూడా ఉంది. అయితే ఇప్పటివరకు ఉన్న ట్రెండ్‌ ప్రకారం దేవర సినిమా హిట్ అనే నమ్మకం అభిమానుల్లో సినీ వర్గాల్లో ఉంది.

అలాగే దేవర రాజమౌళి సెంటిమెంట్ తో పాటు ఒక హిట్‌ సెంటిమెంట్ కూడా ఉంది. అదే ఇప్పుడు దేవరను బ్యాలెన్స్ చేసేలా ఉంది. ఇప్పటివరకు మెగా హీరోలకు ప్లాప్‌లు ఇచ్చిన డైరెక్టర్లు.. నెక్స్ట్ సినిమాలతో బంపర్ హిట్ కొట్టారు. అజ్ఞాతవాసి వంటి ప్లాప్ తర్వాత అరవింద సమేతతో త్రివిక్రమ్ బ్లాక్ పోస్టర్ కొట్టాడు. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి భారీ ప్లాప్ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన జై లవకుశ తో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు బాబి. ఇప్పుడు ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల చేస్తున్న సినిమా దేవర కాబట్టి కచ్చితంగా కొరటాల కంబ్యాక్ ఇస్తాడ‌నే నమ్మకంతో ఫాన్స్ ఉన్నారు. దేవరకు ఈ హిట్ సెంటిమెంట్ క‌లిసోచ్చేలానే ఉంది. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యేలానే ఉంది.. ఇక దేవర రాజమౌళి హీరోల భయాన్ని పోగొడతాడా లేక మరింత భయపడతాడా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: