ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలను రూపొందించడం అంటే అంత చిన్న విషయం ఏమీ కాదు. ఐదు భాషలలో సినిమాను విడుదల చేయాలి కాబట్టి ఐదు భాషల పేక్షకులకు అర్థం అయ్యేలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. దాని కోసం చాలా రోజుల ప్రీ ప్రొడక్షన్ పనులను చేయవలసి ఉంటుంది. ఐదు భాషలకు సంబంధించిన ప్రేక్షకులు ఎలాంటి కథలను ఇష్టపడతారు. చాలా మంది కి నచ్చే విధంగా ప్లాన్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లినట్లయితే ఆ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి అవుతూ ఉంటుంది.
ఇకపోతే రాజమౌళి తను సినిమా స్టార్ట్ చేసే ముందే చాలా రోజుల పాటు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పటి వరకు ఆయన ఈ పద్ధతితో మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక కొంత కాలం క్రితం నాగ్ అశ్విన్ "కల్కి 2898 AD" అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా స్టార్ట్ కాకముందు చాలా కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను ఈ మూవీ కోసం చేశాడు. ఈయన కూడా ఈ సినిమాతో సక్సెస్ అయ్యాడు.
కొరటాల శివ తాజాగా దేవర మూవీ ని రూపొందించాడు. ఈయన కూడా ఈ సినిమాకు ముందు చాలా రోజుల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను నిర్వహించాడు. మరి కొరటాల కూడా దేవర సినిమాతో రాజమౌళి , నాగ్ అశ్విన్ స్థాయిలో సక్సెస్ అవుతాడా ... లేదా అనేది చూడాలి. ఇకపోతే దేవర మొదటి భాగం రేపు అనగా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది.