చైల్డ్ ఆర్టిస్టుతో కొరియోగ్రఫీ చేసిన మెగాస్టార్ చిరంజీవి!
ఈ క్రమంలోనే 1979 నుంచి చిరంజీవికి హీరోగా అవకాశాలు మెరుగ్గా రావడం స్టార్ట్ అయింది. ఆ ఏడాది తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన కోతల రాయుడు అనే చిత్రంలో చిరంజీవి హీరోగా నటించి మెప్పించారు. ఇక ఈ చిత్రం సాంగ్ షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనని ఈ సందర్భంగా తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో 'నెలవంక చిరుగోరింక' అనే సాంగ్ ఉంది. ఈ పాటకి తారా మాస్టర్ కొరియోగ్రఫీ చేయాల్సి ఉంది. కానీ ఆమెకి మరో షూటింగ్ అర్జెంట్ కావడంతో వెళ్లిపోయారు. ఆ సాంగ్ చిరంజీవి, నటి తులసి పై ఉంటుంది. కాగా నటి తులసి చైల్డ్ ఆర్టిస్ట్. కొరియోగ్రాఫర్ లేకపోవడంతో చిరంజీవి అప్పటికప్పుడు తులసితో కలసి కొరియోగ్రఫీ చేశారట. కాగా ఆ సాంగ్ చాలా సూపర్ గా వచ్చింది అని తమ్మారెడ్డి ఈ వేదికపై చెప్పుకొచ్చారు.
దాంతో చిరంజీవికి డ్యాన్స్ పై ఉన్న మక్కువ ఏమిటో అర్ధం అవుతోంది. సింపుల్ స్టెప్పులతో చిరంజీవి ఆ పాటకి కొరియోగ్రఫీ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదని, డాన్సు పట్ల ఎంతో మక్కువ ఉంటేనే అలా చేయగలమని చెప్పుకొచ్చారు సదరు నిర్మాత. ఇక ఆ తులసినే తర్వాత కాలంలో ప్రముఖ నటిగా మారింది. కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాల్లో నిఖిల్ తల్లిగా నటించింది ఆ తులసినే కావడం విశేషం. కాగా కోతల రాయుడు చిత్రంలో ఆమెకి చిరంజీవి బాబాయ్ గా నటించారు. అప్పటికి చిరంజీవికి ఇండస్ట్రీలో ఇంకా సరైన గుర్తింపు రాలేదు. ఆ తరువాత కాలంలోనే చిరు మెగాస్టార్ గా అవతరించారు.