రామ్.. హరీష్ కాంబో మూవీ ఎందుకు క్యాన్సల్ అయ్యిందో తెలుసా.. అది కోరుకోవడం రామ్ తప్పు కాదా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈ మధ్యకాలంలో రామ్ పోతినేని వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం హరీష్ శంకర్ "మిస్టర్ బచ్చన్" అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ ... రామ్ పోతినేని తో ఓ సినిమా త్వరలోనే ఉండబోతుంది అని చెప్పాడు. అలాగే కొంత కాలం క్రితం రామ్ పోతినేని కి ఓ కథ చెప్పాను. అందులో పెద్దగా ఫైట్లు , భారీ డైలాగులు ఇలాంటివి ఏమీ ఉండవు.

అది ఒక సాఫ్ట్ టచ్ ఉన్న మూవీ. ఆ కథ మొత్తం విన్న తర్వాత రామ్ సినిమా కథ బాగానే ఉంది. కాకపోతే మనిద్దరి కాంబోలో వచ్చే సినిమా అంటే ఎలా ఉండాలి. అది అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అయి ఉండాలి. అలాంటి కథ ఏదైనా తయారు చేయి మనిద్దరం కలిసి సినిమా చేద్దాం అన్నాడు. ఇక నేను కూడా ఆ తర్వాత రామ్ తో తీస్తే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తీయాలి అనుకున్నాను. మరికొన్ని రోజుల్లోనే ఆ సినిమా ఉండబోతుంది అని చెప్పాడు.

ఇకపోతే ఒకే రోజు రామ్ నటించిన డబల్ ఇస్మార్ట్ మూవీ , హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు కూడా భారీ అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో సినిమా దాదాపు ఆగిపోయింది అని ఓ వార్త వైరల్ అవుతుంది. మరి వీరి కాంబోలో సినిమా నిజంగానే ఆగిపోయిందా ..? లేక మరికొన్ని రోజుల్లో వీరి కాంబో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: