దేవర ఓ విజువల్ మాస్టర్‌పీస్.. జూ.ఎన్టీఆర్ కెరీర్ మరో కొత్త ఎత్తుకు..?
* ఎన్టీఆర్ లోనే బిగ్గెస్ట్ గ్రాఫికల్లీ ఇంటెన్స్ మూవీ
* ఈ సినిమా హిట్ అయితే తారక్ మరో రేంజ్ కి ఎదిగే అవకాశం
( ఏపీ తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ "దేవర: పార్ట్ 1" రేపే అంటే సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూ.200-300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఈ మూవీ తో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇవన్నీ ఈ సినిమాలోని విశేషాలు అని చెప్పుకోవచ్చు. అయితే వీటన్నిటికంటే మేజర్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులోని గ్రాఫిక్స్ అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో నీటిలో చేసే యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. హాలీవుడ్ గ్రాఫిక్స్ కి ఏ మాత్రం తీసుపోనీ విధంగా ఈ సీన్లు తలపించాయి. ఈ సీన్ల తారక్ ముంబైకి చెందిన ఈతగాళ్ల దగ్గర ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత, సెప్టెంబర్‌లో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను శంషాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన బీచ్ సెట్లో షూట్ చేశారు.
ఈ మూవీలోని గ్రాఫిక్స్ విషయంలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ బ్రదర్ కళ్యాణ్ రామ్ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. "అద్వైత క్రియేటివ్ వర్క్స్" కంపెనీతో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్, డిజిటల్ డొమైన్, స్టెల్త్వర్క్స్ తైవాన్, NXT VFX, NY VFX వాలా, ఆస్కార్ VFX, DNEG, రిడిఫైన్ VFX అనే అనేక వరల్డ్ క్లాస్ కంపెనీలతో ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయించాడు.
దేవర సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీ రోల్ పోషించాయి కాబట్టి, కళ్యాణ్ రామ్ దాదాపు ఎనిమిది నెలలుగా ఈ విషయంపై చాలా పరిశోధన చేశాడు. ఏ దృశ్యాలకు కంప్యూటర్ల సహాయంతో ఎఫెక్ట్స్ చేయాలి, ఏ దృశ్యాలను నిజంగానే చిత్రీకరించాలి అనే విషయాలపై ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏ సీన్లకు విజువల్ ఎఫెక్ట్స్ అవసరం అనేది ముందుగానే తెలుసుకోవడానికి, ఈ సీనఅను చిన్న చిన్న చిత్రాల రూపంలో గీసి ఒక స్టోరీబోర్డ్ అమర్చాడు.
ఈ సినిమాలో కంప్యూటర్ల సహాయంతో చాలా విజువల్లి డిమాండింగ్ సీన్లు చేయాలి కాబట్టి, ఆ దృశ్యాలను చాలా ముందుగానే చిత్రీకరించారు. అంటే, మిగతా సినిమా షూటింగ్ జరుగుతుండగానే, ఈ ప్రత్యేక దృశ్యాలను చిత్రీకరించి, వాటిపై పని చేయడం మొదలుపెట్టారు. ఈ పనిని కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేయాల్సి వచ్చింది. ఇతర దేశాల కంపెనీలు ఈ పనిని పర్యవేక్షించాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఎంటైర్ కెరీర్లో "దేవర" మోస్ట్ విజువల్లీ డిమాండింగ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు చూశాక ఇది ఒక విజువల్ మాస్టర్ పీస్ అవుతుందని చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. ఈ హై గ్రాఫిక్స్ సినిమాతో ఎన్టీఆర్ మరో ఎత్తుకు ఎదగబోతున్నాడని కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రేపటితో ఈ సినిమా గ్రాఫిక్స్ ఎంత బాగుందనేది పూర్తిస్థాయిలో తెలిసిపోతుంది.