చరణ్ తప్పుకుంటే రావడానికి రెడీగా ఉన్నా ఇద్దరు కుర్ర హీరోలు..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్గా నటించగా ... శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ లో అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు.

ఈ మూవీ విడుదల తేదీని ఇక అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ మూవీ నుండి విడుదల అయిన పోస్టర్లలో మాత్రం ఈ సినిమా విడుదల తేదీని మూవీ యూనిట్ మెన్షన్ చేయలేదు. దానితో ఈ సినిమా డిసెంబర్ 20 వ తేదీన విడుదల అవుతుందా ... లేదా అని అనుమానాలు చాలా మంది లో ఉన్నాయి. ఒక వేళ గేమ్ చేంజర్ కనుక డిసెంబర్ 20 వ తేదీన విడుదల కానట్లయితే ఓ ఇద్దరు కుర్ర హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

వారెవరు అనుకుంటున్నారా ..? వారే నితిన్ , నార్నీ నితిన్. నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఒక వేళ గేమ్ చేంజర్ మూవీ విడుదల వాయిదా పడినట్లయితే ఆ తేదీన వచ్చేందుకు నితిన్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. నార్ని నితిన్ ప్రస్తుతం "మ్యాడ్ 2" మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇక డిసెంబర్ 20 వ తేదీన గేమ్ చేంజర్ రిలీజ్ వాయిదా పడితే ఆ తేదీన "మ్యాడ్ 2" విడుదల చేసేందుకు ఈ యువ నటుడు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: