ఠాగూర్ : 18 కోట్లకి అమ్మితే వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బాస్టర్ మూవీలలో ఠాగూర్ మూవీ ఒకటి. ఈ సినిమా భారీ అంచనాల నడుమ 2003 వ సంవత్సరం సెప్టెంబర్ 23 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. శ్రేయ , జ్యోతిక ఈ మూవీ లో హీరోయిన్లుగా నటించగా ఈ మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయ్యి తాజాగా 21 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు ఆ సమయంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఎంత లాభం వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 8.45 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 5.30 కోట్లు , ఉత్తరాంధ్రలో 2.72 కోట్లు , ఈస్ట్ లో 1.90 కోట్లు , వెస్ట్ లో 1.78 కోట్లు , గుంటూరు లో 2.04 కోట్లు , కృష్ణ లో 1.65 కోట్లు , నెల్లూరు లో 1.13 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24.97 కోట్ల కలెక్షన్లు దచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 2.68 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 27.65 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 

ఈ సినిమా 18.40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా ఫైనల్ రన్ ముగిసే సరికి 27.65 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టి 9.25 కోట్ల లాభాలను అందుకొని ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సాయాజీ షిండే ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించగా , మధు ఈ మూవీ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: