సొంత ఇంటిని ఆ స్టార్ హీరో అనాధలకు రాసిస్తే, మన స్టార్ హీరో అమ్ముకున్నాడు?
ఆయన మరెవ్వరో కాదు.. టాలీవుడ్లోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి. తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి, డబ్బు విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని వినికిడి. ఇక చిరంజీవి మెగాస్టార్ గుర్తింపు పొందినప్పటికీ అతని గురించి అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందులో ఇంటి వివాదం ఒకటి. చిరంజీవి 2009 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో మొగల్తూరులో ఉన్న ఆయన ఇంటిని గ్రంథాలయం కోసం అడిగితే కేవలం 3 లక్షలకు ఆశపడి గ్రంథాలయానికి ఇవ్వవలసి వస్తుందని అప్పటికప్పుడు ఇల్లు అమ్ముకున్నాడని వార్తలు వైరల్ అయిన సంగతి విదితమే.
కాగా ఆయన ఇటీవల అదే విషయం పైన ఓ మీడియా వేదికగా వివరణ ఇవ్వడం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో మొగల్తూరు ఇంటి వివాదం గురించి యాంకర్ ప్రశ్నించగా.. చిరంజీవి స్పందిస్తూ, "అసలు మొగల్తూరులో ఉన్న ఇల్లు నాది కాదు. అది నా మేనమామది. ఆ ఇంట్లోనే నేను పుట్టాను. కానీ అంతమాత్రాన ఆ ఇల్లు నాది అయిపోతుందా? ఆ ఇల్లు నా తండ్రి సంపాదించిన ఆస్తి కాదు, నా మేనమామ ఆస్తిని దానమిచ్చే హక్కు నాకు ఎలా ఉంటుంది?" అని చెప్పుకొచ్చాడు. అయితే చిరు ఆ వివాదంపైన ఫుల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ వివాదం పైన అరుదుగా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది!