ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవర మానియా కొనసాగుతోంది. ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరిని కదిలించిన ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నారు. అంటే దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సోలో సినిమా చేయడం జరుగుతోంది జూనియర్ ఎన్టీఆర్.
దీంతో దేవర సినిమా పైన చాలా ఆశలు పెట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ సినిమా రెండు సంవత్సరాలుగా షూటింగ్ పూర్తి చేసుకొని... రిలీజ్ కు రెడీ అయింది. ఈనెల 27వ తేదీన... అంటే ఎల్లుండి రిలీజ్ కాబోతోంది. ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రెండు భాగాలలో ఈ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో... ఇప్పటికే ఫ్యాన్స్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
అయితే తాజాగా టికెట్లు బుకింగ్ విషయంలో భారీ.. స్కాం వెలుగులోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో.. అలాగే చాలామంది టికెట్లు బుక్ చేసుకునే నేపథ్యంలో కొన్ని ఫేక్ వెబ్సైట్లు తెరపైకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ టికెట్లను పెట్టి ఫ్యాన్స్ కు ఎలా వేస్తున్నారు. తప్పుడు వెబ్ సైట్లలో టికెట్లు ఉన్నట్లు... డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని గమనించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఎవరు ఆన్లైన్లో మోసపోకూడదని కోరుతున్నారు. టికెట్లు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త పాటించాలని కూడా వెల్లడిస్తున్నారు. ఫేక్ వెబ్సైట్లో టికెట్లు కొనేటప్పుడు జాగ్రత్త పాటించాలని కూడా చెబుతున్నారు ఫ్యాన్స్. కాగా దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మొన్నటి ఆదివారం నిర్వహించాల్సి ఉండేది. కానీ భద్రతా కారణాలవల్ల ఈవెంట్ రద్దయింది.. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర.. ఆందోళనకు గురయ్యారు.