దేశవ్యాప్తంగా ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైందని.... అందులో జంతువుల కొవ్వును వాడుతున్నారని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో తిరుమల శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
అయితే కొంతమంది జగన్మోహన్ రెడ్డి అలా చేసి ఉండబోడు అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో... జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాస్త ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. కూటమి లో ఉన్న పవన్... హిందుత్వాన్ని కాపాడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే లడ్డు కల్తీ అయిందని 11 రోజుల దీక్ష కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
ఈ ధర్నాలోనే తాజాగా తమిళ హీరో కార్తీ అలాగే నటుడు ప్రకాష్ రాజు కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే... తాటతీస్తానని కూడా ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డు గురించి హీరో కార్తీక్... తాను స్పందించబోనని అది చాలా సెన్సిటివ్ అంశమని.. చెప్పుకొచ్చారు. దీంతో... ఈ అంశంపై.. పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. లడ్డు గురించి ఏ హీరో మాట్లాడినా ఊరుకునేది లేదన్నారు.
అయితే దీనిపై వెంటనే కార్తీక్ రియాక్ట్ అయి కూడా చెప్పారు. అయితే ఈ వివాదంలో తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు చాలా సీరియస్ అవుతున్నారట. మన హీరో కార్తీక్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా పవన్ కళ్యాణ్ అలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఏంటి అని మండిపడుతున్నారట. దీనిపై ఏదో ఒకటి చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారట తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. తమిళ హీరోను ఎవరు అన్న ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నారట.