తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత వేగంగా సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైర్మెంట్ , పీపుల్స్ మీడియా సంస్థ వారు ముందు వరుసలో ఉన్నారు. వీరు సంవత్సరానికి కనీసంలో కనీసం మూడు , నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వచ్చిన సినిమాలలో చాలా శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోగా , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వచ్చిన సినిమాలలో చాలా శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయిన కూడా ఈ సంస్థ అధినేత అయినటువంటి టీ జీ విశ్వ ప్రసాద్ సినిమాలను నిర్మిస్తూనే వస్తున్నాడు.
ఇక సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ మాత్రం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. దానితో మంచి విజయాలను కూడా అందుకుంటున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విశ్వ సేన్ హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఓ మూవీ ని ప్రారంభించారు. ఆ తర్వాత ఈ సినిమా యొక్క బాధ్యతలను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వారు దక్కించుకున్నారు. ఇక మళ్ళీ ఆ సినిమా తిరిగి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కే వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మూవీ స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా పీపుల్స్ మీడియా సంస్థ దగ్గర నుండి వెళ్లిపోయింది. మరి ఈ మధ్య కాలంలో ఈ నిర్మాణ సంస్థ చేస్తున్న సినిమాలలో రాజా సాబ్ మూవీ ని మినహాయిస్తే ఏ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. మరి ఈ సినిమా అయిన ఈ సంస్థకు మంచి విజయాన్ని అందిస్తుందో ... లేదో చూడాలి.