టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. చిరుత మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన రామ్ చరణ్ మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే చరణ్ తన రెండవ మూవీ తోనే మగధీర అనే సినిమాలో హీరోగా నటించి ఏకంగా ఆల్ టిమి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నుండి చరణ్ కి అసలైన పరీక్ష మొదలైంది.
ఆరెంజ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత రచ్చ , నాయక్ , ఎవడు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న రెగ్యులర్ కమర్షియల్ మూవీలు అని అలాగే చరణ్ ఒకే రకమైన యాక్టింగ్ ను చూపిస్తున్నాడు అనే నెగెటివిటీ కొంత మంది ఆడియన్స్ నుండి రావడం మొదలు అయింది. ఇకపోతే ఇలాంటి సమయంలోనే రామ్ చరణ్ ధ్రువ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత నుండి కూడా ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా డిఫరెంట్ సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.
ఇకపోతే ధ్రువ సినిమా కంటే ముందు స్టార్ డైరెక్టర్ మణిరత్నం , రామ్ చరణ్ తో ఎప్పుడు ఎందుకు ఒకే రకమైన సినిమాలను చేస్తున్నావు. నీకు అద్భుతమైన పొటాషియల్టి ఉంది. నువ్వు ఇలాంటి రోటీన్ కమర్షియల్ సినిమాలలో నటించకు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలలో నటించు అని చెప్పాడట. దానితో అప్పటి నుండి చరణ్ కూడా రొటీన్ కమర్షియల్ సినిమాలలో కాకుండా డిఫరెంట్ సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తుంది.