కులాంతర వివాహం మహాపాపం - సాయి పల్లవి

Divya

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమై , ఆ మొదటి సినిమాతోనే అందరి హృదయాలను దోచుకుంది. తొలి పరిచయంలోనే అందరి చేత శభాష్ అనిపించుకున్న ఈమె.. నటనలోనే కాదు డాన్స్ విషయంలో కూడా మంచి పేరు అందుకుంది. ముఖ్యంగా తను నటించే ప్రతి సినిమాలో కూడా తన డాన్స్ పెర్ఫార్మన్స్ కు సంబంధించి ఒక చిన్న క్లిప్ అయినా ఉంటుందనడం లోసందేహం లేదు. సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ.. చిట్టి పొట్టి దుస్తులకు దూరంగా ఉండే ఈమె, గ్లామర్ పాత్రలకు కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా సరే రిజెక్ట్ చేస్తూ ఉంటుంది.
సినిమా జీవితానికే కాదు అప్పుడప్పుడు వ్యక్తిగత జీవితానికి కూడా కాస్త ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి ఇటీవలే తన చెల్లెలు పూజా పెళ్లి కూడా ఘనంగా జరిపించింది. ఇదిలా ఉండగా తాజాగా కులాంతర వివాహాలపై తన అభిప్రాయాలను వెల్లడించి, అందరిని ఆశ్చర్యపరిచింది సాయి పల్లవి. ప్రస్తుతం కులాంతర వివాహం పై సాయి పల్లవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సాయి పల్లవి మాట్లాడుతూ.. మా కమ్యూనిటీలో కులాంతర వివాహం మహా పాపంగా చూస్తారు. మేము బాల్యంలో ఉన్నప్పుడు మా పెద్దవారు మా కమ్యూనిటీ లోనే వివాహం చేసుకోవాలని చెప్పేవారు.  అయితే అలా చెప్పిన వారే.. ఆ రూల్ దాటి వేరే వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఇకపోతే మా కమ్యూనిటీలో ఇంకొక కమ్యూనిటీ కి చెందిన వారిని వివాహం చేసుకుంటే వారికి ఎటువంటి వేడుకలకు ఆహ్వానం ఉండదు.  ఎవరైనా మా కమ్యూనిటీలో మరణించినప్పుడు చేసే అంత్యక్రియలకు కూడా వారిని రానివ్వరు అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే తన కమ్యూనిటీలో కులాంతర వివాహం మహా పాపం అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: