రామ్ పారితోషకం చూసి.. పారిపోతున్న నిర్మాతలు.. మరి ఇంతేంటి గురూ?
అయితే ఇలా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రామ్ టాలెంట్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. కొత్త కుర్రాడు అయినా యాక్టింగ్ డాన్స్ ఫైట్స్ అదరగొట్టేస్తున్నాడు. ఇక రాను రాను ఇతను ఇండస్ట్రీలో స్టాప్ హీరో అవడం ఖాయం అని అనుకున్నారూ. ఇక అతనికి సూపర్ హిట్లు పడటంతో తిరుగులేదు అని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం రామ్ చేసిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వట్లేదు. పాజిటివ్ టాక్ వచ్చిన యావరేజ్ గానే మిగిలిపోతుంది. రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు ఎంత ఘోరమైన ఫ్లాప్స్ చవిచూసాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయితే ఇండస్ట్రీలో సక్సెస్ ను బట్టి పారితోషికం కూడా కొనసాగుతూ ఉంటుంది. కానీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ పోతినేని పారితోషకం విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదట. పాతిక కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అడుగుతున్నాడట. అయితే ప్రస్తుతం వరుస ప్లాపులతో ఉన్న రామ్ కు మార్కెట్ అంత లేదు. ఒక ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక్కటే 35 కోట్ల రూపాయలకు పైగా షేర్లు వచ్చాయి. మిగిలిన ఏ చిత్రాలకు 25 కోట్లు దాటలేదు. అలాంటి రామ్ పోతినేని రెమ్యూనరేషన్ అంతలా అడగడం అస్సలు న్యాయంగా లేదని నిర్మాతలు కూడా పారిపోతున్నారట. మరి ఇలా అయితే రామ్ కి ఫ్యూచర్లో సినిమా ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.