ఏపీ, తెలంగాణ‌లో దేవ‌ర టిక్కెట్ రేట్లు... ఏంటి ఈ గంద‌ర‌గోళం... !

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మిక్కిలినేని సుధాకర్ - నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించిన దేవర సినిమా మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడంతో పాటు అదనపుషోలు వేసుకునేలా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేసాయి. ఇందుకు సంబంధించి స్పెషల్ జీవోలు కూడా ఇచ్చాయి. అయితే ఈ టిక్కెట్ల పెంపు అనేది ఆంధ్రప్రదేశ్లో ఒకలా ఉంటే .. తెలంగాణలో మరోలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటిలా కాకుండా మంచి రేట్లు ఇచ్చారు. చాలా కాలం తర్వాత అర్ధరాత్రి షోల‌కు కూడా అనుమతులు ఇచ్చారు. ఇది నిజంగా ఒక విశేషం ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబుతో సరైన సంబంధాలు లేవు అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టికెట్ రేట్లు పెరగవని .. అదనపుషోలకు అనుమతులు ఉండవని చాలామంది అనుకున్నారు.

కానీ నిర్మాత నాగవంశీ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు కొనుగోలు చేయడంతో పవన్ కళ్యాణ్ తో ఆయనకు ఉన్న అనుబంధంతో మంచి రెట్లు సాధించారు. ఇక నైజాంలో ఎప్పుడూ మంచి రేట్లు వస్తాయి అనేది అందరికీ తెలిసిందే. ఈసారి అలా జరగలేదు. మొదటి రోజు రేట్లు పెంపు వరకు బాగానే ఉంది. కానీ రెండో రోజు నుంచి చాలా తక్కువగా పెంచారు. ఇలా ఎందుకు జరిగింది ? అన్నది ఎవరికీ అర్థం కావటం లేదు. కొందరు అయితే కావాలనే ఇలా చేశారు అని అంటున్నారు. నైజాంలో పెద్ద సినిమాలు కు పెద్ద రేట్లు పెడితే సిటీ వరకు బాగానే ఉంటుందని కింద బీ - సీ సెంటర్లలో రేట్లు ఎక్కువ అయితే కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది అన్నది దేవర పంపిణీ వర్గాల ఆలోచన.

అందుకే మొదటి రోజుకే 100 రూపాయల అదనపు రేటు పెంచి రెండో రోజు నుంచి 25 నుంచి 50 రూపాయల లెక్కన పెంచాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఇదే స్ట్రాటజీని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయలేదు ? అన్నది కూడా ఇక్కడ మిలియ‌న్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ తో పాటు మరో సీనియర్ హీరో బాబీ డియోల్ మ‌రో విల‌న్‌గా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: