రిలీజ్‌కు ముందే ' దేవ‌ర ' సెన్షేష‌న‌ల్‌... తార‌క్ ఏంది ఈ అరాచ‌కం...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా దేవర భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే పాటలు .. ట్రైలర్తో పాటు కొన్ని రికార్డులు సొంతం చేసుకున్న దేవర తాజాగా మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ లో ఫ్రీ సేల్స్ బుకింగ్స్ లో అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ చేరుకుని సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా తాజాగా రెండు మిలియన్ డాలర్ల మార్క్‌ చేరుకుంది. రిలీజ్ కు మరో రెండు మూడు రోజులు టైం ఉండగా ఓవర్సీస్ లో దేవర ఫ్రీ సేల్ టికెట్ బుకింగ్స్ లో హ‌వా కొనసాగిస్తోంది.
తాజాగా దేవర రెండు మిలియన్ డాలర్ల మార్క్‌ చేరుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. రిలీజ్ కు మరో మూడు రోజుల టైం ఉంది. దీంతో రిలీజ్ డే నాటికి ఫస్ట్ డే కంప్లీట్ అయ్యే టైం కు దేవర 4 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక దేవర ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో రు. 113 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.

అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు రు. 220 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తే కానీ దేవర బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 180 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లారు. లాస్ట్ ఏంజల్స్ లో జరగనున్న బియాండ్ ఫెస్ట్ లో ఎన్టీఆర్ పాల్గొంటారు. ఈ ఈవెంట్లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ సినిమాగా ఎన్టీఆర్ దేవర రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: