వామ్మో ఇదేం క్రేజ్.. అరాచ‌కం రా సామీ... దేవ‌ర టిక్కెట్ @ రు. 1000 ..!

RAMAKRISHNA S.S.
- నైజాంలో ప్ర‌భుత్వ జీవో తో బెనిఫిట్ షోల‌కు ప్ర‌య‌త్నాలు
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. అయితే 26వ తేదీ అర్ధరాత్రి దాటాక 1 గంట‌ నుంచి బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలో అర్ధరాత్రి షోలు వేసేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. నైజాంలో డిస్ట్రిబ్యూటర్లు బెనిఫిట్ షోల కోసం అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి అనుమతులు .. జీవో తెచ్చుకుని ఒక్కో టిక్కెట్ వెయ్యి రూపాయలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీవో తెప్పించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా వెయ్యి రూపాయల టికెట్ పెట్టి వేసే షోలకు కేవలం సింగిల్ స్క్రీన్ల లోనే అనుమ‌తులు ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంటే సింగిల్ స్క్రీన్ల‌లో అర్ధ‌రాత్రి షోలు వేస్తారు. ఆ షోల‌కు మాత్ర‌మే టిక్కెట్ కు రు. వెయ్యి పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్ర‌భుత్వం నుంచి అధికారికంగా అనుమ‌తుల తో పాటు జీవో తెచ్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు భావిస్తున్నార‌ట‌.

అదే మ‌ల్టీఫ్లెక్స్ ల‌లో షోలు వేస్తే రు. వెయ్యిలో రు. 500 వాళ్ల‌కే ఇచ్చేయాలి. ఎందుకంటే మ‌ల్టీఫ్లెక్స్ లు అన్నీ 50 - 50 షేరింగ్‌లో మాత్ర‌మే షోలు వేస్తాయి. వాళ్లు అర్ధ‌రాత్రి రిస్క్ చేసి షోలు వేయాలంటే స‌గం అమౌంట్ ఇవ్వాల్సిందే. అప్పుడు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మిగిలేది ఏం ఉండ‌దు. అందుకే కేవ‌లం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్ల‌లో అర్ధ‌రాత్రి స్పెష‌ల్ షో వేసి.. ఒక్కో టిక్కెట్‌కు రు. వెయ్యి పెడితే తొలి రోజు క‌లెక్ష‌న్లు అదిరిపోతాయ‌ని వాళ్లు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: