టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి చిరంజీవి , రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొత్తం 14 సినిమాలలో నటించాడు. ఆ సినిమాలు ఏవి ... వాటి రిజల్ట్ ఎలా ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
వీరి కెరీర్లో మొదటగా మోసగాడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో శోభన్ బాబు హీరోగా నటించగా , చిరంజీవి విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తిరుగులేని మనిషి అనే మూవీ వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిరంజీవి రెండవ హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో అడవి దొంగ మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో కొండవీటి రాజా అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో చాణక్య శబదం అనే మూవీ వచ్చింది.
ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వీరి కాంబోలో మంచి దొంగ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో యుద్ధభూమి అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వీరి కాంబోలో రుద్రనేత్ర మూవీ వచ్చింది. ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత వీరి కాంబోలో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ వచ్చింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబోలో రౌడీ అల్లుడు మూవీ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో ఘరానా మొగుడు సినిమా వచ్చింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ఇద్దరు మిత్రులు పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. వీరి కాంబోలో ఆఖరుగా శ్రీ మంజునాథ సినిమా వచ్చింది. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది.