హిట్ ఇచ్చిన దర్శకుడి కోసం అలాంటి పని చేసిన రవితేజ, శ్రీలీల..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటీ నటులుగా రవితేజ , శ్రీ లీల కెరియర్లు కొనసాగిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో కొంత కాలం క్రితం ధమాకా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. ఈ సినిమాకు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తో రవితేజ కు , శ్రీ లీల కు మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత రవితేజ కు ఇప్పటివరకు మంచి విజయం దక్కలేదు. ధమాకా లాంటి విజయవంతమైన సినిమా తర్వాత త్రినాథ్ రావు నక్కిన , సందీప్ కిషన్ హీరోగా ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు మజాకా అనే టైటిల్ ను ఖరారు చేస్తూ తాజాగా ఓ పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ వారు విడుదల చేశారు.

అలాగే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ఓ మూవీ రూపొందుతుంది. ఈ సినిమాకు మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా యొక్క చిత్రీకరణను RT 75 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తూ వస్తున్నారు. ఈ మూవీ ని కొంత కాలం వరకు వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలబబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా ఈ మూవీ సంక్రాంతి బరి నుండి వెనక్కు తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ధమాకా మూవీ తో మంచి విజయాన్ని ఇచ్చిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న మజాకా సినిమా రవితేజ RT 75 ప్లేస్ లో లో రాబోతున్నట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇలా తమకు హిట్ ఇచ్చిన దర్శకుడి కోసం రవితేజ , శ్రీ లీల సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: