రాజమౌళి తర్వాత ఆ నలుగురికి దక్కిన క్రేజ్.. రైస్ లో ఉన్నవారు సక్సెస్ అయ్యేనా..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పరిస్థితి చాలా తక్కువ స్థాయిలో ఉండేది. మన హీరోలు నటించిన సినిమాలకు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తే అది పెద్ద విషయంగా మన ఇండస్ట్రీ వారు వారు చూసేవారు. కానీ రాజమౌళి ఆ పరిస్థితులన్నింటినీ మార్చేశాడు. ఈయన కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా బాహుబలి సిరీస్ మూవీలను రూపొందించాడు. ఈ మూవీలను తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశాడు. ఈ మూవీ లు భారీ సక్సెస్లను అందుకున్నాయి. వందల కోట్ల కలెక్షన్లను రాబడ్డాయి. ఈ సిరీస్ మూవీ లతో తెలుగు సినీ పరిశ్రమ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

దానితో చాలా మంది దర్శకులు కూడా రాజమౌళి రేంజ్ లో సినిమాలను నిర్మించాలి అని అత్యంత ఆసక్తిని చూపిస్తూ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించిన సందర్భాలు ఉన్నాయి. కానీ వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. రాజమౌళి తర్వాత పన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ను సాధించిన తెలుగు దర్శకులు కొంతమంది ఉన్నారు. వారిలో సుకుమార్ ఒకరు. ఈయన పుష్ప పార్ట్ 1 మూవీ ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. మరికొన్ని రోజుల్లోనే పుష్ప 2 మూవీ ని కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు జనాల్లో ఉన్నాయి. కొంత కాలం క్రితం నిఖిల్ హీరోగా చందు మండేటి కార్తికేయ 2 మూవీ ని పాన్ ఇండియా మూవీగా రూపొందించాడు. ఈ మూవీ సూపర్ గా సక్సెస్ అయింది. ఈ మూవీ తో చందు మండేటి కి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

కొంత కాలం క్రితం తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD సినిమా వచ్చింది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయింది. ఇలా రాజమౌళి తర్వాత ఈ నలుగురు దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఈ రెస్ లో కొరటాల శివ మరి కొంత మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: