నటి సంచలన ఆరోపణలు... ఆ సూపర్‌స్టార్ నన్ను బలవంతం చేశారు?
అతడు తనని కౌగిలించుకోవడానికి యత్నించినప్పుడు ఆమె చాలా అసౌకర్యాన్ని ఫీల్ అయినట్టు చెప్పుకొచ్చింది. దాంతో సదరు యాంకర్ తప్పుడు పద్ధతిలో అతడు మిమ్మల్ని కౌగిలించుకున్నారా? అని అడిగినప్పుడు షామా స్పందిస్తూ... "అక్కడ అస్సలు నన్ను కౌగిలించుకోవడం అనేది షూట్లో భాగం కానే కాదు. కానీ అతడు నన్ను కౌగిలించుకోవాలని పదేపదే అనుకునేవాడు. షూటింగ్ చేస్తున్నప్పుడు సీన్ ని ఇంప్రూవైజ్ చేశాడు. అతడు తన భార్య నగలు నాకు వేస్తానని కూడా చెప్పగా నేను అవసరం లేదని తిప్పికొట్టాను. అతడు నన్ను కౌగిలించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ రకమైన స్పర్శతో నేను అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. అంతకు ముందు ఎప్పుడూ అలాంటిది అనుభవించలేదు!" అంటూ చెప్పుకొచ్చింది.
కాగా ఆమెకి అది చాలా షాకింగ్ గా అనిపించిందట. ఆమె చాలా మంది వ్యక్తులతో పనిచేసినా, చాలా మంది ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నా అటువంటిది ఎప్పుడూ అనుభవించలేదు అని చెప్పుకొచ్చింది. కాగా ఆ వ్యక్తి సూపర్‌స్టార్ అని కూడా చెప్పుకొచ్చింది. కానీ అతని పేరుని మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. నేను ఆ వ్యక్తిని మొదటిసారి కలిశాను. అతడి ఆలోచన సాధారణమైనదిగా అనిపించలేదు. దాంతో అతను పెద్ద స్టార్ అయినా నా జీవితంలో అతనితో కలిసి పనిచేయను! అని అక్కడే తెగేసి చెప్పను అని అన్నారు. ఈ క్రమంలోనే తనకు అవకాశాలు తప్పిపోయాయని కూడా తెలిపింది.