ఆ న‌వ‌ల‌ జోలికిపోతే నేను అస్సలు ఊరుకోను: దర్శకుడు శంక‌ర్

Suma Kallamadi
స్టార్ తమిళ దర్శకుడు శంకర్ గురించి జనాలకి పరిచయం అనవసరం! ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటే రాజమౌళి గుర్తుకొస్తారు కానీ, దాదాపు 15 ఏళ్ల క్రితం పాన్ ఇండియా అంటే దర్శకుడు శంకర్ మాట చెప్పేవారు. అప్పట్లో అయన తెరకెక్కించిన జెంటిల్ మేన్, బొంబాయి, ఒకే ఒక్కడు, భారతీయుడు, రోబో సినిమాలు కేవలం తమిళంలోనే కాకుండా... తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా దుమ్ము దులిపేవి. అయితే ఇపుడు పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ ఆయనకి ఆమడ దూరంలో ఉంటోంది. కానీ శంకర్ సినిమా వస్తుందంటే ఈరోజుకీ ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇక అసలు విషయంలోకి వెళితే... పాపుల‌ర్ త‌మిళ న‌వ‌ల నుంచి ఎవ‌రైనా సీన్లు కొట్టి తీస్తే గనుక దానిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని దర్శకుడు శంకర్ కొంతమంది సో కాల్డ్ ఫిలిం మేకర్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ నవలపైన తనకి పూర్తి హ‌క్కులు ఉన్నాయ‌ని, హక్కులు ఏనాడో కొనుగోలు చేసానని అన్నారు. కాగా ఇదే విషయాన్ని ఆయన ఇండియన్ 2 ప్రమోషనల్ ఈవెంట్‌లో కూడా చెప్పుకొచ్చారు. తమిళ నవల `నవ యుగ నాయగన్ వేల్ పారీ`ని తెరపైకి తీసుకురావాలనే తన ఆకాంక్షను శంక‌ర్ బ‌య‌ట‌ పెట్టిన సంగతి విదితమే. మహమ్మారి - ప్రేరిత లాక్‌డౌన్ సమయంలో "సు వెంకటేశన్" పుస్తకాన్ని చూసి తడబడ్డానని, దాని కథనంపై చాలా త్వరగా అభిమానాన్ని పెంచుకున్నానని శంకర్ అప్పుడు వెల్లడించాడు.
కాగా కొంతమంది చిత్ర నిర్మాతలు నవల నుండి సన్నివేశాలను అనధికారికంగా ఉపయోగించడం జరిగింది. ఈ సందర్భంలో శంకర్ తన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఒక‌ కాపీరైట్ హోల్డర్‌గా త‌న‌ అనుమతి లేకుండా దాని నుండి ఆలోచ‌ల‌న‌ల‌ను స్వీకరించే హక్కు ఎవరికీ లేదని, ఒకవేళ అలా చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని శంకర్ తన X ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోస్టు చేస్తూ... "అందరికీ ముఖ్య విజ్ఞప్తి! వెంకటేశన్ ఐకానిక్ తమిళ నవల 'నవ యుగ నాయగన్ వేల్ పారీ'లోని కొన్ని సీన్లు అనుమతి లేకుండా దొంగిలించి మార్చి చూప‌డం, ఉపయోగించడం జరిగింది. ఇటీవల విడుద‌లైన ఓ సినిమా ట్రైలర్‌లో కూడా నవల నుండి ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని కొట్టేసారు! దయచేసి నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్ సిరీస్‌లు లేదా ఇంకేదైనా మాధ్యమంలో వాడుకోవడం మానుకోండి. లేదా చట్టపరమైన చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది!" అని హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: