టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు మొదటి నుంచి చిక్కులు వస్తూనే ఉన్నాయి. కచ్చితంగా హిట్ కొట్టాలని ఎంతో కసిగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ ఈ సినిమాను తీశారు. అయితే అలాంటి దేవర సినిమాకు తాజాగా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆదివారం నిర్వహించాలని తలపెట్టిన దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్... అనివార్య కారణాల వల్ల రద్దు అయింది.
హైదరాబాదులోని ప్రముఖ హోటల్లో ఈవెం ట్ నిర్వహిం చాలని ఫస్ట్ నిర్ణయం... తీసుకోవడం జరిగింది. ఈ మేరకు కొంతమందికి పాసులు కూడా అందజేశారు. అయితే పరిమితికి మించి అభి మానులు... ఈ ఈవెంట్ కు వచ్చారు. అయితే ఆ సమయంలో సెక్యూరిటీ కూడా సరిగా లేదు. దీంతో విఐపి గ్యాలరీలోకి అభిమానులు దూసుకు వచ్చారు. లోపలికి రావడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అక్కడ రచ్చ రచ్చ చేశారు. అదే సమయంలో పోలీసులు చేతులెత్తేయడం జరిగింది.
అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించేశారు. దీంతో హోటల్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఎన్టీఆర్ అభిమానులు. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే.. ఇదంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే సెక్యూరిటీని.. తగ్గించేసారని అభిమానులు ఫైర్ అవుతున్నారు.
కల్కి లాంటి సినిమాకు.. హైదరాబాద్ బయట ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించుకునేందుకు ఛాన్సులు ఇచ్చారని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు మాత్రం సిటీ అవుట్స్ కట్స్ లో... ఈవెంట్ నిర్వహించుకోవడానికి రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఫైర్ అవుతున్నారు. అందుకే ఈవెంట్ క్యాన్సల్ అయింది అని కూడా రేవంత్ రెడ్డి పై నిప్పులు జరుగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్.