దేవర ఈవెంట్ : శ్రేయస్ ఆ మిస్టేక్ ముందే పసిగట్టాల్సిందే.. అందుకే ఈ చేదు అనుభవం..?

Pulgam Srinivas
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో గత కొన్ని రోజులుగా ఈ మూవీ యూనిట్ దేశవ్యాప్తంగా ప్రచారాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పెద్ద ఓపెన్ గ్రౌండ్స్ లో ఈ మూవీ బృందం వారు భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. కానీ ఓపెన్ గ్రౌండ్స్ లో అనుమతులు ఈజీగా రాకపోవడం వల్ల చిన్న స్థాయిలో హైదరాబాదులోని నోవెటెల్ హోటల్లో ఫ్రీ రిలీజ్ ను సెప్టెంబర్ 22వ తేదీన సాయంత్రం నిర్వహించనున్నట్లు మూవీ బృందం ప్రకటించింది.

ఇక ఈవెంట్ నిర్వహణ బాధ్యతలను శ్రేయస్ సంస్థ తీసుకుంది. ఇక ఇక్కడే శ్రేయస్ సంస్థ చాలా పెద్ద పొరపాటు చేస్తుంది. ఎందుకు అంటే నోవెటెల్ హోటల్ స్థాయి చాలా చిన్నది. అందులో కనీసం మూడు లేదా నాలుగు వేల వరకు మంది మాత్రమే పట్టే అవకాశం ఉంటుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి ఈమేజ్ అదిరిపోయే స్థాయిలో ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆఖరి సినిమా విడుదల ఇప్పటికే అయ్యి మూడు సంవత్సరాలకు పైగా అయ్యింది. సోలో హీరోగా సినిమా వచ్చే ఆరు సంవత్సరాల సమయం అయింది. దానితో తమ అభిమాన హీరోను చూడాలి అని ఎప్పటి నుండో వేచి చూస్తున్నా అభిమానులు అంత వస్తారు అని కచ్చితంగా శ్రేయస్ సంస్థ ఆలోచించి ఉండాల్సిందే. అలాంటి ఆలోచన చేయలేదు. కేవలం మూడు నుంచి నాలుగు వేల కెపాసిటీ ఉన్న హోటల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలి అనే ఆలోచనకు రావడంతో పెద్ద మిస్టేక్ ను చేసింది. ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే సమయానికి అక్కడికి పెద్ద మొత్తంలో జనాలు వచ్చారు.

దానిని హ్యాండిల్ చేయలేక శ్రేయస్ సంస్థ వారు హోటల్ మేనేజ్మెంట్ చేతులెత్తేసింది. ఇక పోలీస్ శాఖ వారు కూడా ఇంత మంది ని ఈ హాల్ లో హ్యాండిల్ చేయలేము అని తేల్చి చెప్పేసింది. దానితో ఈవెంట్ క్యాన్సిల్ అయింది. శ్రేయస్ సంస్థ నోవేటెల్ హోటల్లో ఈ ఈవెంట్ చేయాలి అని అనుకున్నప్పుడే ఇక్కడ కుదరదు అని వారికున్న అనుభవంతో చెప్పాల్సింది. కానీ ఆ మిస్టేక్ ను ముందే పసిగట్టకపోవడంతో ఈ సంస్థ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించడంలో ఫెయిల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: